• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దాసరి సూచనలు...

దాసరి సూచనలు తీసిపడేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2015-10-15 08:53 GMT
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ర్టీలా పెద్ద తలకాయలా ఒక వెలుగు వెలిగిన దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి మద్దతు పలికేవారే కరవవతున్నారు. తాజాగా ఆయన పెద్ద సినిమా హీరోల సినిమాల మధ్య కనీసం రెండు వారల గ్యాప్ ఉంటే బాగుంటుందని సూచన చేయగా నిర్మాత సురేశ్ బాబు ఆ మాటలను కొట్టిపారేశారు.  రుద్రమదేవి - బ్రూస్ లీ సినిమాల నేపథ్యంలో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడగా సురేశ్ బాబు కొట్టిపారేశారు.

మంచి సినిమాలకు ఎప్పుడూ థియేటర్లు దొరక్కపోవడమన్న సమస్యే లేదని.. ఉయ్యాల జంపాల, భలేభలేమగాడివోయ్ వంటి సినిమాలకు థియేటర్లు దొరకలేదా... అవి ఆడలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్న సురేశ్ బాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాసరి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన సినీ పరిశ్రమలో ఉంది. దీంతోనే సురేశ్ బాబు కాస్త హార్డ్ గానే స్పందించారు. ఎన్ని థియేటర్లలో ఆడిస్తామన్నది ముఖ్యం కాదని... సినిమా ఎంత బాగుందన్నదే ప్రధానమని.. సినిమాలు బాగుంటే  జనం వస్తారని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు చెందిన సూర్య సినిమేక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభానికి హాజరైన సురేశ్ బాబు దాసరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దాసరి వ్యాఖ్యలపై రాంచరణ్ కూడా కాస్త తీవ్రంగానే ఎదురుదాడి చేశారు. అయితే... నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వ్యంగ్య బాణాలు వేశారు. ఆయన మాటలు వినడానికి మాత్రమే బాగుంటాయని అనేశారు రాంచరణ్. దీంతో కొత్త తరం కూడా దాసరిపై ఎదురుదాడి చేస్తుండడంతో తెలుగు ఇండస్ర్టీలో ఆయన పనైపోయిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    
  • D Suresh Babu 
  • Dasari Narayana Rao 
  • Bruce Lee Release Postpone 
  • Telugu News 
  • Telugu Cinema News 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS