ఎన్టీఆర్ 'అయినను..' మూవీ పై క్రేజీ అప్డేట్!!
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ - దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో 'అరవింద సమేత' సినిమా బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే. 2018లో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. అంతవరకు ఎన్టీఆర్ నుండి ఊహించని డైలాగ్ డెలివరీ.. యాక్షన్ చూపించాడు త్రివిక్రమ్. మొదటి ప్రయత్నంలోనే వీరిద్దరూ తమ సత్తా చూపించేశారు. ఎన్టీఆర్ నుండి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో పాటు త్రివిక్రమ్ నుండి డిఫరెంట్ డైలాగ్స్ నందమూరి ప్రేక్షకులకు పుల్ మీల్స్ అయ్యాయి. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. ఆ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.
రాబోయే ఏడాది.. అంటే 2022లో విడుదల చేయాలనీ భావిస్తున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కొంతకాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పనుల మీదనే దృష్టి పెట్టాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కానున్నాడు. అయితే పక్కా పొలిటికల్ మాస్ ఎలిమెంట్స్ తో రూపొందించనున్న ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. త్వరలోనే ప్రారంభించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరగా ముగించి వచ్చే వేసవి సమయంలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.