కంగనపై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశం
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ చిక్కుల్లో పడ్డారు. కొద్దిరోజులుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ను టార్గెట్ చేసిన కంగన ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ముంబైలో రాజకీయం చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ బిల్లులను కూడా ఆమె సమర్థించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు షాక్ తగిలింది..
కంగనా రౌనత్ పై కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిని విమర్శిస్తూ కంగనా సెప్టెంబర్ 21న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే కంగనా తన ట్వీట్ లో ఆందోళనలు చేస్తున్న రైతులను ‘టెర్రరిస్ట్’లతో పోల్చడం దుమారం రేపింది. దీనిపై రమేశ్ నాయక్ అనే ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఆమెపై క్యాతసంద్ర పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద ఫిర్యాదు చేయగా కోర్టు పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. దీనిపై నాయక్ స్పందిస్తూ.. కంగన చేసిన ట్వీట్ తనను ఎంతగానో బాధించిందని.. ఆమెపై కేసు పెట్టేలా ప్రేరేపించిందని తెలిపింది.