బాలీవుడ్ టాలీవుడ్ ప్ర‌ముఖుల్ని వెంబ‌డిస్తున్న క‌రోనా

Update: 2021-04-13 06:30 GMT
బాలీవుడ్ లో వ‌రుస‌గా ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. అదే త‌ర‌హాలో టాలీవుడ్ లోనూ ప‌లువురు సెల‌బ్రిటీలకు క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ జాబితా అంత‌కంత‌కు పెరుగుతోంది.

అన్ లాక్ ప్ర‌క్రియ అనంత‌రం ప్రోటోకాల్ పాటిస్తూనే షూటింగుల్లో పాల్గొంటున్నా ఏదో ఒక ర‌కంగా క‌రోనా సెల‌బ్రిటీల‌కు అంటుకుంటోంది. అలా ఇప్ప‌టికే చాలామందికి పాజిటివ్ వ‌చ్చింది. ఇంత‌కుముందు చిరంజీవి.. చ‌ర‌ణ్ చికిత్స పొంది కోలుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న రాజ‌మౌళి క‌రోనాకు చికిత్స పొంది కోలుకున్నారు.

తాజాగా అర‌డ‌జ‌ను పేర్లు తెర‌పైకొచ్చాయి. అగ్ర నిర్మాత‌ అల్లు అర‌వింద్.. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కి కూడా క‌రోనా సోకింది. చికిత్స పొందుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. దర్శకుడు త్రివ్రికమ్.. హీరోయిన్ నివేదా థామస్ లు కరోనాకు చికిత్స పొందుతున్నారు. తాజాగా నిర్మాత దిల్‌ రాజు.. స్టార్ డైరెక్ట‌ర్ గుణశేఖర్ మ‌రో ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అలాగే న‌టుడు కం నిర్మాత బండ్ల గ‌ణేష్ కి రెండో సారి క‌రోనా సోక‌డం టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వ‌కీల్ సాబ్ ఈవెంట్ కి వెళ్లి వ‌చ్చాక‌.. ఆయ‌నకు జ్వ‌రం రావ‌డంతో క‌రోనా టెస్ట్  చేయించి అనంత‌రం పాజిటివ్ రావ‌డంతో అపోలోలో  చేరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అనుచ‌రుల్లో ఎక్కువ‌మందికి క‌రోనా సోక‌డంతో స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లారు. ఇక కరోనా లక్షణాలేవీ కనిపించకుండా పరీక్షల్లో దిల్‌ రాజుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆయన నిర్భంధంలోకి వెళ్లారు. వారం క్రితం హ‌రీష్ శంక‌ర్ కొత్త చిత్రం కోసం ప‌వన్ పై ఫోటోషూట్ జ‌రుగుతుంటే దిల్ రాజు వెళ్లి క‌లిసారు. అలాగే ఆయ‌న‌ శాకుంత‌లం సెట్స్ కి వెళ్లారు. ఇలా ప‌వ‌న్ - దిల్ రాజు- గుణ‌శేఖ‌ర్ చైన్ క‌దలిక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆలస్యంగా పాజిటివ్‌ అయిన గుణశేఖర్‌ కూడా క్వారంటైన్ కి వెళ్లారని తెలిసింది.

అయితే ప‌లువురు సినీప్ర‌ముఖుల క్వారంటైన్ సంగతుల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న‌లేవీ రాకపోవ‌డంతో అభిమానులు క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు.
Tags:    

Similar News