ట్యాగ్ తో పనేముంది.. కావాల్సింది అది కదా..
ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే.. ట్యాగ్ తో సంబంధం లేకుండా అంతా చూస్తారని అన్నారు. దానికి తోడు రవితేజకు సూపర్ క్రేజ్ ఉండడం వల్ల.. ట్యాగ్ ను బేస్ చేసుకుని మూవీ చూడరు కదా అని అంటున్నారు.;
సినీ ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరోకు ఏదో ఒక ట్యాగ్ ఉంటుంది.. ఆయా నటుడిని అదే ట్యాగ్ తో అంతా పిలుచుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ.. తన ట్యాగ్ మాస్ మహారాజాను అప్ కమింగ్ మూవీ విషయంలో తీసేయమని చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరికొద్ది రోజుల్లో రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తన్న ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ఆయన ఓ ఇంటర్వ్యూలో రవితేజ మాస్ మహారాజా ట్యాగ్ తీసేద్దామని చెప్పినట్లు తెలిపారు.
మాస్ మహారాజా ట్యాగ్ ఉంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా మాస్ సినిమా అనుకుంటారని చెప్పారు. అలా ఆ మూవీ మాస్ ఎంటర్టైనర్ కాదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ విషయంపై నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ట్యాగ్ తీసినంత మాత్రాన ఏమవుతుందని క్వశ్చన్ చేస్తున్నారు.
ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంటే.. ట్యాగ్ తో సంబంధం లేకుండా అంతా చూస్తారని అన్నారు. దానికి తోడు రవితేజకు సూపర్ క్రేజ్ ఉండడం వల్ల.. ట్యాగ్ ను బేస్ చేసుకుని మూవీ చూడరు కదా అని అంటున్నారు. దీంతో అది నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రవితేజ మాస్ చిత్రాలే కాదు మిగతా జానర్లను కూడా టచ్ చేశారు.
కథ, స్క్రీన్ ప్లే, పాత్ర బలంగా ఉండటంతో ట్యాగ్ తో సంబంధం లేకుండా ఆయా సినిమాలు హిట్టయ్యాయి. కానీ కొంతకాలంగా ఆయన కంటెంట్ వీక్ గా ఉన్న సినిమాలు చేస్తున్నారని చెప్పాలి. అందుకే వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా హిట్ అందుకోవడం లేదు. యాక్టింగ్ తో మెప్పిస్తున్నా రిజల్ట్ మాత్రం అనుకున్నట్లు రావడం లేదు.
ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న ఈ సమయంలో, కేవలం హీరో ఇమేజ్ మీదే సినిమాలు నడుస్తాయనే భావన ఇక పనిచేయడం లేదు. బలమైన కథ, కొత్తదనం, పాత్రకు సరైన ట్రీట్ మెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కావల్సింది రవితేజ ఇప్పుడు అవసరం ట్యాగ్ ను తీసేయడం కాదు.
సినిమాల్లో కొత్త కంటెంట్ ను తీసుకురావడం. మాస్, క్లాస్ అనే భేదం లేకుండా కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇటీవల పలువురు హీరోలు విభిన్న కథలను ఎంచుకుని విజయాలు సాధిస్తున్న ఉదాహరణలు ఇందుకు నిదర్శనం. కాబట్టి కంటెంట్ పై ఫోకస్ చేస్తే చాలు.. హిట్ దక్కుతుంది. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తితో సెలక్షన్ లో రవితేజ ఎలాంటి అడుగు వేశారో చూడాలి.