ప్రభాస్‌ని పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీ?
అసలు ప్రభాస్ ని పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అని కొందరు అమ్మాయిలు ప్రభాస్ ని ప్రశ్నిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.;
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో ప్రభాస్ ఎప్పటికీ బ్యాచిలర్స్ గానే మిగిలారు. ఆ ఇద్దరూ పెళ్లి ఊసెత్తరు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా రికార్డుల్లో నిలిచారు. సల్మాన్ షష్ఠిపూర్తి చేసుకున్నాడు. కానీ డార్లింగ్ ప్రభాస్ వయసు 46. అయినా ఇంకా పెళ్లి మాటెత్తడం లేదు. దీనిపై రెబల్‌స్టార్ కృష్ణంరాజు జీవించి ఉన్న రోజుల్లో చాలా ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల దివంగత స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలా దేవిగారు కుమారుడు ప్రభాస్ పెళ్లి గురించి న ప్రశ్నలకు చాలా వరకూ సమాధానాలిచ్చారు. తనయుడి పెళ్లికి ఇంకెంతో దూరం లేదని కూడా అన్నారు. అయినా ప్రభాస్ నోటి నుంచి పెళ్లి మాట వినిపించలేదు. ఫలానా బిజినెస్‌మేన్ కుమార్తె లేదా ఫలానా రాజకీయ నాయకుడు కం పారిశ్రామికవేత్త కుమార్తె లేదా ఎన్నారై కుమార్తెను ప్రభాస్ పళ్లాడుతున్నాడు! అంటూ గాసిప్స్ వచ్చినా కానీ, ఏవీ నిజాలు కాలేదు.
అయితే వృత్తిగత జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడుతున్న ప్రభాస్ కి పదే పదే పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ దానికి సమాధానాలు దాట వేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న `ది రాజా సాబ్` ప్రీరిలీజ్ వేడుకలో మరోసారి అభిమానులు ప్రభాస్ ని ఇదే విషయమై ప్రశ్నించారు. కొందరు ఫ్లకార్డులు పట్టుకుని మరీ ప్రభాస్ ని ప్రశ్నించడంతో అతడు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. యాంకర్ సుమ తనదైన శైలిలో డార్లింగ్ నుంచి తెలివిగా సమాధానం రాబట్టింది.
అసలు ప్రభాస్ ని పెళ్లాడాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అని కొందరు అమ్మాయిలు ప్రభాస్ ని ప్రశ్నిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. దానికి అతడు సింపుల్‌గా ``అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు...`` అనేసాడు. దీని అర్థం.. అసలు అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ప్రభాస్ కి నిజంగానే తెలియదా? ఇంకా తికమక పడుతూనే ఉన్నాడా? అతడి మకతికను సెట్ చేసే సరైన అమ్మాయే అతడికి ఎదురుపడలేదా? ఇలా రకరకాల డౌట్లు పెట్టేసాడు డార్లింగ్.
ప్రతిసారీ దాటవేసినట్టే ఈసారి కూడా పెళ్లి గురించి ఏదీ తేల్చకుండా డార్లింగ్ తెలివిగా దాటవేసాడు. కానీ `ది రాజా సాబ్` రిలీజ్ తర్వాత అయినా పెళ్లి గురించి ఆలోచిస్తాడా? ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడా? బాహుబలి రిలీజైనప్పటి నుంచి అతడి పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు పోరుతున్నారనే వార్తలు వచ్చాయి. మైక్ ల ముందు కృష్ణంరాజు- శ్యామలాదేవి దంపతులు పదే పదే అతడి పెళ్లి చూడాలని ఆత్రపడుతున్నట్టు చెప్పారు. కానీ ఇప్పటికీ దీనికి ప్రభాస్ నుంచి సమాధానం లేదు. `ది రాజా సాబ్`తో హిట్టు కొట్టాక, తదుపరి ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో `కల్కి 2898 ఏడి` పూర్తవ్వడం కోసం ఎదురు చూస్తాడేమో!?