ఆ నటిని నిర్మాతలు తొక్కే ప్రయత్నం!
ప్రేక్షకుల అంచనాలు అందుకోక పోతే చివరికి అంతా ఒక్కటే అవుతారంది. `పేట` సినిమాలో హీరోయిన్ కానప్పటికీ ఆ ఛాన్స్ వదులుకోవాలనుకోలేదు.;
మాలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ తొలి సినిమా `ది రాజాసాబ్` రిలీజ్ కంటే ముందే బోలెడంత ఫేమస్ అయిపోయింది. అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తోనే సాధ్యమైందన్నది కాదనలేని నిజం. చిట్టి పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోతతోనే? అంతగా వెలుగులోకి వచ్చింది. ఇక `రాజాసాబ్` రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోవడం ఖాయం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ చిత్రంలో ఛాన్స్ అందు కుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే మరికొన్ని చిత్రాలకు సైన్ చేసిందని వార్తలొస్తున్నాయి.
ఇవన్నీ నిజమా? కాదా? అన్నది `రాజాసాబ్` రిలీజ్ అనంతరం తేలిపోతాయి. అయితే ఈ బ్యూటీ హీరోయిన్ కాక ముందు రజనీకాంత్ హీరోగా నటించిన `పేట` సినిమాలో ఓ సైడ్ క్యారెక్టర్ పోషించింది. అదే అదునుగా కొందరు నిర్మాతలు తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు చేసారంది. నటీనటులకు పర్పెక్ట్ లాంచ్ అంటే ఏదీ ఉండదంది. `దీపీకా పదుకొణే `ఓంశాంతి ఓం`తో గ్రాండ్ గా లాంచ్ అయింది. నేనే కాదు నాతో పాటు చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ అందరికీ అలా కుదరదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా? దర్శకుడి సినిమా అయినా ఫలితం నిర్ణయించేది ప్రేక్షకుల మాత్రమే.
ప్రేక్షకుల అంచనాలు అందుకోక పోతే చివరికి అంతా ఒక్కటే అవుతారంది. `పేట` సినిమాలో హీరోయిన్ కానప్పటికీ ఆ ఛాన్స్ వదులుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేసాక కొందరు నిర్మాతలు నువ్వు ఇక అలా సైడ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకోవాల్సిందే అని విమర్శించారు. కెరీర్ అక్కడితో ముగిసిపోతుందని ఇష్టాను సారం మాట్లాడారు. ఓ నటిని అలా ఎలా జడ్డ్ చేసారా? అన్నది ఇప్పటికీ అర్దం కాలేదంది. `నేనిప్పుడు కొన్ని పెద్ద సినమాలు చేస్తున్నా. వాటిలో `రాజాసాబ్` ఒకటి. ప్రభాస్ తో కలిసి నటిస్తున్నాను. ఇలా జరుగుతుందని ఆ నాడు విమర్శించిన నోళ్లు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? అని ఎదురు తిరిగింది.
ఇండస్ట్రీలో కొందరు కావాలని ప్రేక్షకుల మననసుల్లో నెగిటివ్ ఫీలీంగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆలస్యంగా అర్దం చేసుకున్నానంది. ముందే విషయాన్ని గమనించి ఉంటే ఆరోజే కౌంటర్ వేసేదాన్ని అని తెలిపింది. `పట్టంపోలే` సినిమాతో మాళవికా మోహనన్ మాలీవుడ్ లో పరిచయమైంది. అప్పటి నుంచి సొగసరి మాలీవుడ్ సహా కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఛాన్సులు రావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ప్రస్తుతం తమిళ్ లో కార్తీ హీరోగా నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `సర్దార్ 2` లో నటిస్తోంది.