ఇమ్మాన్యుయేల్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు?.. అక్కడే రివీల్ చేస్తాడా?

అయితే ఆ ఊహాగానాలకు తాజాగా ఇమ్మాన్యుయేల్ స్వయంగా తెరదించారు. సోషల్ మీడియాలో తన రియల్ గర్ల్‌ ఫ్రెండ్‌ ను అభిమానులకు పరిచయం చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.;

Update: 2025-12-27 16:27 GMT

కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షోలో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 లో పాల్గొని తన పాపులారిటీ ఫుల్ గా పెంచుకున్నారు. ఆద్యంతం సీజన్ అంతా ఎంటర్టైన్ చేశారు. అత్యంత ఎంగేజింగ్ కంటెస్టెంట్ గా ప్రశంసలు అందుకున్నారు.

సీజన్ చివరి వరకు నిలిచి, థర్డ్ రన్నరప్‌ గా బయటకు వచ్చినప్పటికీ.. ఓ రేంజ్ లో మెప్పించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అయితే బిగ్‌ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయేల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పలు యూట్యూబ్ చానెల్స్, మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు.

బిగ్‌ బాస్ హౌస్ లో అనుభవాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ సమయంలో తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అయితే జబర్దస్త్‌ తో పాటు అనేక షోల్లో ఎప్పటికప్పుడు సందడి చేసే వర్షతో కలిసి ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

వీరిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ కారణంగా నిజ జీవితంలో కూడా వారు ప్రేమికులేనని సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఓ షోలో ఇమ్మాన్యుయేల్ తల్లిదండ్రులు వర్షతో కనిపించారు. దీంతో ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య రిలేషన్ నిజమేనని చాలా చాలా ఇప్పటికే ఫిక్స్ కూడా అయిపోయారు.

అయితే ఆ ఊహాగానాలకు తాజాగా ఇమ్మాన్యుయేల్ స్వయంగా తెరదించారు. సోషల్ మీడియాలో తన రియల్ గర్ల్‌ ఫ్రెండ్‌ ను అభిమానులకు పరిచయం చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. గర్ల్‌ ఫ్రెండ్ పేరును వెల్లడించకుండా… ఆమె చేతిని తన చేతితో పట్టుకున్న కూల్ ఫోటోను మాత్రమే ఇమ్మాన్యుయేల్ నెట్టింట షేర్ చేశాడు.

ఆ ఫోటోకు ప్రేమను సూచించే క్యాప్షన్ యాడ్ చేశారు. త్వరలో పెళ్లి కూడా ఉండొచ్చని పరోక్షంగా ఇచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం తాను ప్రేమిస్తున్న అమ్మాయి హైదరాబాద్‌ లోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతోందని ఇమ్మాన్యుయేల్ వెల్లడించారు. అయితే ఆమె ప్రైవసీని గౌరవిస్తూ పేరు బయట పెట్టడం లేదని స్పష్టం చేశారు.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అంతా విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ వేదికపైనే తన గర్ల్ ఫ్రెండ్ ను అధికారికంగా పరిచయం చేస్తారేమో అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి స్క్రీన్‌ పై ఎప్పుడూ నవ్వులు పూయించే ఇమ్మాన్యుయేల్, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రావొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Full View
Tags:    

Similar News