కమీషన్ ముందు శివాజీ సైలెంట్ అయ్యాడా?
డిసెంబర్ 27న వ్యక్తిగతంగా కమీషన్ ముందు హాజరు కావాలని అదేశారు జారీ చేసింది. దీంతో శనివారం శివాజీ హైదరాబాద్ బుద్ధభవన్‌లోని తెలంగాణ మహిళా కమీషన్ ముందు హాజరయ్యారు.;
నటుడు శివాజీ ఉదంతం నాటకీయ మలుపులు తిరుగుతోంది. తాను నటించిన `దండోరా` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ, సింగర్ చిన్మయి, రామ్ గోపాల్ వర్మ ఫైర్ అవ్వడంతో ఈ వివాదం కాస్తా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని సుమోటోగా తీసుకున్న తెలంగాణ మహిళా కమీషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 27న వ్యక్తిగతంగా కమీషన్ ముందు హాజరు కావాలని అదేశారు జారీ చేసింది. దీంతో శనివారం శివాజీ హైదరాబాద్ బుద్ధభవన్‌లోని తెలంగాణ మహిళా కమీషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమీషన్ చైర్‌పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు శివాజీ సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే శివాజీ తన తప్పు ఒప్పుకున్నారని తెలంగాణ మహిళా కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం మహిళా కమీషన్ ముందు హాజరైన శివాజీ తన తప్పు ఒప్పుకున్నారట.
విచారణలో నటుడు శివాజీ తన తప్పు అంగీకరించారని, కమీషన్ చైర్‌పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. మహిళలను సమదృష్టితో చూడాలని, ఇతరుల విషయంలో అనుచయిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లు కమీషన్ తెలిపింది.
`90స్` వెబ్‌సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన శివాజీ వైవిద్యమైన కథలని, పాత్రలని ఎంచుకుంటూ వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. `90స్` వెబ్‌సిరీస్ తరువాత శివాజీ చేసిన `కోర్ట్` మూవీ కూడా సక్సెస్ కావడం, అందులో తను పోషించిన మంగపతి పాత్రకు మంచి పేరు రావడంతో శివాజీ కి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రీసెంట్‌గా చేసిన `దండోరా` కూడా విజయం సాధించడం, అదే సినిమా కారణంగా శివాజీ వివాదంలో చిక్కుకోవడంతో శివాజీ కెరీర్‌పై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.