కుర్ర‌హీరోతో స్టార్ డాట‌ర్ ఏమిటిలా త‌న్మ‌యంలో!

Update: 2020-12-12 14:21 GMT
న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స‌ర‌స‌న కేదార్ నాథ్.. ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న సింబా చిత్రాల్లో నటించిన సారా ప్ర‌స్తుతం మ‌రో క్రేజీ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న కూలీనంబ‌ర్ 1 రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోవిందా-క‌రిష్మా జంట న‌టించిన క్లాసిక్ మూవీ రీమేక్ ఇది. ఇప్పటికే టీజ‌ర్లు ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కి రానున్న సంద‌ర్భంగా సారా-ధావ‌న్ బోయ్ జంట ప్ర‌చారం అద‌ర‌గొట్టేస్తున్నారు. ఇక సారా స్ట‌న్నింగ్ డ్యాన్స్ మూవ్స్ కి యూత్ పిచ్చెక్కిపోతున్నారు.

యంగ్ వ‌రుణ్ ధావ‌న్ తో సారా కెమిస్ట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదిగో ఇలా ఓ స్టిల్ లో ఈ అంద‌మైన జంట రొమాన్స్ ముచ్చ‌ట గొలుపుతోంది. `స్టేజెస్ ఆఫ్ ఫోజింగ్` అంటూ ఒక కాంటెస్ట్ ని పోస్ట్ చేస్తూ ఐదు రూల్స్ చెప్పింది సారా.

ఫోజు ఇచ్చాక న‌వ్వుతూ క‌నిపించాలి. కొంత‌సేప‌టికి బిగ్గ‌ర‌గా న‌వ్వేయాలి. ఆ త‌ర్వాత కౌగిలించుకుని థాంక్ గాడ్.. అనేయాలి. ఆ స్టైల్ కి త‌గ్గ‌ట్టు క్యాప్ష‌న్ తో ఈ ఫోస్ట్ ని షేర్ చేయాలి.. అంటూ రూల్స్ చెప్పుకొచ్చింది సారా. కాంటెస్ట్ ప్ర‌కారం ప్ర‌తి ప్రేమ జంటా ఇలా ఫోజిచ్చాక ఫోటో తీసి వ‌రుణ్ ధావ‌న్ కి కాల్ చేయాల‌ట‌. అన్న‌ట్టు కుర్ర‌హీరోతో మ‌రీ అంత‌గా త‌న్మ‌య‌త్వంలోకి వెళ్లిపోతోంది. ఇలా అయితే క‌ష్ట‌మే అంటూ అభిమానులు గుస‌గుస‌లాడేస్తున్నారు.
Tags:    

Similar News