చిరు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు అదే కాన్సెప్ట్
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే పలు విషయాలు వెళ్లడయ్యాయి. చిరంజీవి ఎర్రటవల్ బుజం మీద వేసుకుని ఉండటంతో ఇందులో చిరంజీవి ఉద్యమ నాయకుడి పాత్రలో కనిపిస్తాడని క్లారిటీ వచ్చేసింది. ఇక చిరంజీవి తాజాగా చిరంజీవి అనుకోకుండా సినిమా స్టోరీని కాస్త రివీల్ చేశాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
కొరటాల శివ తన గత సినిమాలన్నింటిలో కూడా సమాజంలో ఉన్న సమస్యలపై హీరోలు పోరాడుతున్నట్లుగానే చూపించాడు. ఈయన గత చిత్రం భరత్ అనే చిత్రంలో పొలిటికల్ అంశాలను కూడా టచ్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆచార్యలో కూడా అదే తరహాలో సోషల్ మెసేజ్ తో పాటు పొలిటికల్ డ్రామాను కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి ఇలాంటి తరహా సినిమాలు వరుసగా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆచార్య తర్వాత చిరంజీవి మలయాళ హిట్ మూవీ లూసీఫర్ ను చేస్తాడంటూ మెగా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ రీమేక్ పై సుజీత్ వర్క్ చేస్తున్నాడట. చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి లూసీఫర్ ను ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా చిరంజీవితో ఆయన తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. చిరంజీవి చేయబోతున్న రెండు వరుస చిత్రాలు కూడా సేమ్ కాన్సెప్ట్ కాని కథలు విభిన్నంగా ఉండబోతున్నాయట. పొలిటికల్ థ్రిల్లర్ చిత్రాలతో చిరంజీవి వరుసగా సక్సెస్ లను అందుకుంటాడా అనేది చూడాలి.