• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : రెబల్ స్టార్‌...

ఫొటోటాక్ : రెబల్ స్టార్‌ కు కామెడీ స్టార్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

By - Tupaki Desk
Update: 2021-10-30 09:30 GMT
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కొన్ని సంవత్సరాలకు ముందు ఏడాదిలో వందల సంఖ్యలో సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కాని కాలం మారుతున్న కొద్ది బ్రహ్మానందంకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆయన గొప్ప హాస్య నటుడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు కాని ఈతరం ప్రేక్షకులు ఆయన్ను వినియోగించుకోలేక పోతున్నారు. అందుకే ఆయన మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈమద్య కాలంలో కాస్త సీరియస్‌ పాత్రలు మరియు కొన్ని రెగ్యులర్ కామెడీ పాత్రలు చేస్తున్న బ్రహ్మానందం ఎక్కువ సమయంను తనకు ఇష్టమైన డ్రాయింగ్‌ తో గడుపుతున్నాడు. బ్రహ్మానందం మంచి కమెడియన్ మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆర్టిస్టు అనే విషయం ఇండస్ట్రీలో అందరికి తెల్సిన విషయమే. ఎన్నో అద్బుతమైన చిత్రాలను తన కలం నుండి ఆయన వేయడం జరిగింది.

అప్పుడప్పుడు బ్రహ్మానందం వేసిన ఆర్ట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా తాను వేసిన ఒక ఆర్ట్‌ ను రెబల్ స్టార్‌ కృష్ణం రాజు దంపతులకు స్పెషల్‌ గిఫ్ట్‌ గా ప్రజెంట్ చేయడం జరిగింది. బ్రహ్మానందం అందులో సాయి బాబా ఆర్ట్ ను వేయడం జరిగింది. చాలా అరుదైన ఈ ఆర్ట్ ను కృష్ణం రాజు దంపతులకు ఇచ్చిన బ్రహ్మానందం ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం బ్రహ్మానందం మునుపటి తేజస్సును కలిగి లేడు అనే టాక్ వచ్చింది. కాని ఈ ఫొటోల్లో చూస్తుంటే బ్రహ్మానందం ఆహనా పెళ్లంట సినిమాలో ఎలా అయితే కనిపించాడో ఇప్పుడు కూడ అలాగే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ఇక బ్రహ్మానందం త్వరలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన రంగమార్తండ సినిమాలో కీలక పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాదిలో జాతిరత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో కోర్టు జడ్జిగా కనిపించి మెప్పించాడు. ఇప్పటికి బ్రహ్మానందం స్క్రీన్‌ పై కనిపిస్తే స్టార్‌ హీరో రేంజ్ లో ఈలలు గోలలు కనిపిస్తున్నాయి. కనుక బ్రహ్మానందం కోసం కొత్తగా కామెడీని రాస్తే ఖచ్చితంగా మళ్లీ ఆయన నవ్విస్తాడనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం కొత్త రచయితలు మరియు కొత్త దర్శకులు ప్రయత్నించాలంటూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    
  • Prabhas 
  • Krishnam Raju 
  • Brahmanandam 
  • brahmanandam comedy 
  • Radhe Shyam 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS