ట్రైలర్ టాక్: మెస్మరైజింగ్ నయన్
దక్షిణాదిన హీరోల్లోనే కాదు.. హీరోయిన్లలోనూ సూపర్ స్టార్లున్నారు. అందులో నయనతార ఒకరు. సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చిన హీరోయిన్లలో అనుష్క తర్వాత నయన్ పేరే చెప్పుకోవాలి. ‘మయూరి’.. ‘కర్తవ్యం’ లాంటి సినిమాలతో ఆమెకు తిరుగులేని ఇమేజ్ వచ్చింది. ఈ రెండు సినిమాలూ అటు తమిళంలో.. ఇటు తెలుగులో మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆమె నుంచి ‘కోలమావు కోకిల’ అనే థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ చిత్రాన్ని ‘కోకో కోకిల’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్లోనే సూపర్బ్ అనిపిస్తోంది. నయనతార ఇందులో స్మగ్లర్ పాత్రలో నటించడం విశేషం.
25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఆమె ఒక చోటి నుంచి మరో చోటికి చేర్చాల్సి వస్తుంది. ఇందు కోసం ఆమె తన తల్లిదండ్రులు.. చెల్లి.. తనను ప్రేమించే ఒక కమెడియన్ని వెంట బెట్టుకుని ఒక వ్యాన్లో ప్రయాణం చేయడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నదే ఈ కథ. పైకి ఏమీ తెలియని అమాయకురాలి లాగా కనిపిస్తుంది నయన్ పాత్రలో అనూహ్యమైన కోణాలు ఉంటాయని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. నయన్ ను ఫినిష్ చేయాలని విలన్లు అనుకుంటే ఆమె రివర్స్ తిరిగి.. తనలోని మరో యాంగిల్ చూపిస్తుంది. ట్రైలర్ చూస్తే సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా కనిపిస్తోంది. నయన్ లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. నయన్ ను ప్రేమించే పాత్రలో కమెడియన్ యోగిబాబు నటించడం విశేషం. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 17న తెలుగు-తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View