సీనియర్ నటి కూతురి కోసం వచ్చిన సీఎం

Update: 2021-07-07 23:30 GMT
తమిళనాడు సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్ తన పరభేదం లేకుండా ముందుకు సాగుతున్నారు. పగవారిని కూడా క్షమిస్తూ వారి వైపు సానుకూలత వ్యక్తం చేస్తున్నాడు. ఎవ్వరు పిలిచినా పలుకుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు అంతా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి తమ మద్దతు తెలిపారు. సెక్యూలర్ భావాలు కలిగిన స్టాలిన్ పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వారందరినీ ఆదరిస్తున్నారు.

తాజాగా చెన్నైలో నటుడు పొనవన్నర్-శరణ్య దంపతుల ఇంట పెళ్లి సందడి నెలకొంది.  వీరి కుమార్తె ప్రియదర్శిని, విఘ్నేష్ ల వివాహం రిసెప్షన్ తాజాగా చెన్నైలోని ఓ హోటల్ లో ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనుకోని విధంగా ఈపెళ్లికి ఓ అనుకోని అతిథి హాజరయ్యారు. ఆయన ఎవరో కాదు.. ముఖ్యమంత్రి స్టాలిన్. ఇక ఆయన కుమారుడు, ఎమ్మెల్యే కంట నటుడు అయిన ఉదయనిధి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై అతిథులను ఆశ్చర్యపరిచారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వధూవరులను ఆశీర్వదించారు.
Tags:    

Similar News