• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నలుగురు భామలతో అతని...

నలుగురు భామలతో అతని సినిమా

By - Tupaki Desk
Update: 2018-01-02 08:34 GMT
సినిమా మేకింగ్ లో డైరెక్టర్ తరవాత అంత కష్టపడేది... తపన పడేది కచ్చితంగా సినిమాటోగ్రాఫర్లే. ఏ సీన్ తీయాలో డైరెక్టర్ నెరేట్ చేయగానే ఎలా తీయాలి.. ఏ లైటింగ్ లో తీయాలి.. సీన్ లో అనుకున్న మూడ్ తెరపై కనిపించాలంటే ఏం చేయాలన్నది సినిమాటోగ్రాఫర్ కు గట్టి పట్టు ఉంటేనే ప్రేక్షకుడు సీన్ లోని ఇంటెన్సిటీ ఫీల్ అవగలిగేది. కొన్ని సినిమాలు దృశ్యకావ్యాల్లా మిగిలిపోయాయంటే.. అందులో సినిమాటోగ్రాఫర్ల కష్టం చాలానే ఉంది.

సినిమాటోగ్రాఫర్లుగా రాణిస్తున్న వారు చాలామందే ఉన్నా రైటర్లలాగా మరోమెట్టు ఎక్కి డైరెక్టర్ అవాలని ఆశపడే సినిమాటోగ్రాఫర్లు కాస్తంత తక్కువే. మారుతి డైరెక్షన్ లో వచ్చి బంపర్ హిట్ కొట్టిన మహానుభావుడు - భలేభలే  మగాడివోయ్ సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసిన నిజార్ షఫీ త్వరలో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఇతడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా చడీచప్పుడు లేకుండా స్టార్టయి షూటింగ్ కూడా అయిపోతుందని తెలుస్తోంది. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా డీటైల్స్ త్వరలోనే బయటపెడతామని సినిమా యూనిట్ లోని సభ్యుడు ఒకరు తెలిపారు.

థ్రిల్లర్ ప్రధాన ఎలిమెంట్ గా వస్తున్న ఈ సినిమాలో ఓ ఇన్విస్టిగేషన్ తరహాలో స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. ‘‘ఈ మూవీలో నలుగురు భామలు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అంజలి - అనీషా ఆంబ్రోస్ - నందిత శ్వేత - శ్రద్ధ శ్రీనాథ్ ఈ నాలుగు పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నలుగురు క్యారెక్టర్ల చుట్టూనే కథ తిరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు రివీల్ అవుతాయని’’ ఈ మూవీ యూనిట్ సభ్యుడు  చెప్పుకొచ్చారు.
Tags:    
  • Cinematographer Nizar Shafi 
  • Director 
  • Telugu News 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS