క్లిక్ క్లిక్‌ః టాలీవుడ్ సెలబ్రెటీల క్రిస్మస్ వేడుకలు
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. మన దేశంలో కూడా మతాలకు అతీతంగా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. సాదారణంగా సెలబ్రెటీలు అంతా కూడా క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొంటూ ఉంటారు. ఎక్కువ శాతం సెలబ్రెటీలు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడంతో పాటు స్నేహితులతో క్రిస్మస్ పార్టీని కూడా చేసుకుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్ ప్రముఖులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చిరంజీవి తన స్టైలిష్ లుక్ తో క్రిస్మస్ ట్రీ వద్ద ఫోజ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు ఇద్దరు కూడా క్రిస్మస్ ట్రీ వద్ద ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఇక యంగ్ హీరో సుధీర్ బాబు ఏకంగా తన కండలు తిరిగిన బాడీకి వెనుక వైపున క్రిస్మస్ ట్రీ డ్రా చేయించుకున్నాడు. మెగా కుర్ర హీరోలు ఇతర మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక కొత్త జంట నిశ్చయ్ కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇంకా టాలీవుడ్ కు చెందిన హీరోయిన్స్ స్టార్స్ పలువురు క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు.