వైరల్ అవుతున్న బాలీవుడ్ తారల క్రిస్మస్ సెలెబ్రేషన్స్..!!

Update: 2020-12-25 07:58 GMT
ఈ ఏడాది కరోనా మహమ్మరి కుదుపు తర్వాత మెల్లగా కోలుకుంటూ పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు దేశ ప్రజలు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పనులు లేక ప్రస్తుతం మళ్ళీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా మెరుగు పడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి భారమైన సమయంలో నుండి బయటికి రాగానే కాస్త పండుగ వాతావరణం కల్పిస్తోంది క్రిస్మస్. ఈ క్రిస్మస్ వేడుకలను సామాన్య జనాల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల వరకు గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సినిమా థియేటర్లు ప్రారంభం కావడంతో సినీ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అభిమాన తారలు ఏం చేసిన వెంటనే ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ఫోటోలను, అందుకుంటున్న క్రిస్మస్ కానుకలను, బంధు మిత్రులతో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లను ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి చూస్తూ ప్రస్తుతం ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక తమ ఫ్యాన్స్ కి అలాంటి ఆనందాన్ని అందిస్తున్నారు బాలీవుడ్ సినీతారలు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, కపూర్ ఫ్యామిలీ మెంబెర్స్, అలాగే ఖాన్ హీరోల కుటుంబాలు సెలెబ్రేషన్స్ జరిపిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీలో అభిషేక్, ఐశ్వర్య, జయలు.. మరో వైపు కపూర్ సిస్టర్స్ కరిష్మా, కరీనా కపూర్ లు ఫ్యామిలీలతో డిన్నర్ పిక్స్ అలా పోస్ట్ చేసి అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ తారల క్రిస్మస్ సంబరాలు ఫోటోలుగా నెట్టింట వైరల్ అవడం మనం చూడవచ్చు.
Tags:    

Similar News