హీరోకు చెల్లి పాత్ర ఇప్పిస్తానని ఏం చేశాడో తెలుసా?

Update: 2020-01-16 11:16 GMT
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమద్య కాస్త మీడియాలో ఈ విషయమై దుమారం రేపడం వల్ల పెద్ద ఎత్తున వివాదాలు అవ్వడం వల్ల కాస్టింగ్‌ కౌచ్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాస్టింగ్‌ కౌచ్‌ కు పాల్పడుతున్న వారు ఇంకా ఉన్నారని తాజాగా బెంగళూరులో జరిగిన ఈ సంఘటనతో వెళ్లడయ్యింది. సినిమాల్లో ఆఫర్స్‌ ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించే ప్రయత్నం చేసి.. అది సాధ్యం కాకపోవడంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి మూడు రోజుల పాటు నిర్భందించి అఘాయిత్యంకు పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్నడ సినిమాలకు కొరియోగ్రఫర్‌ గా పని చేసిన పవన్‌ అనే డాన్సర్‌ కు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో అమ్మాయిలను తన బుట్టలో వేసుకోవడం చేస్తూ ఉన్నాడు. ఒక డాన్స్‌ స్టూడియోను రన్‌ చేస్తున్న ఇతగాడు ఇటీవల ఒక అమ్మాయిని ట్రాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమెకు సుదీప్‌ సినిమాలో చెల్లి పాత్రను ఇప్పిస్తాను అంటూ నమ్మబలికాడు. ఆమెను డాన్స్‌ స్టూడియోకు రప్పించి కూల్‌ డ్రింక్‌ లో మత్తు మందు ఇచ్చి అఘాయిత్యంకు పాల్పడ్డాడు. ఆమెను అఘాయిత్యం చేసిన సమయంలో ఫొటోలు వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి రెండు రోజులు నిర్బందించి మరీ అఘాయిత్యం చేశాడు.

పవన్‌ లేని సమయంలో ఆమె పారిపోయి పోలీసు స్టేషన్‌ కు చేరుకుంది. అన్నపూర్నేశ్వరి నగర పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో పవన్‌ పై పోలీసులు 354 మరియు 376 కేసులను నమోదు చేయడం జరిగింది. అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి ఫోన్‌ లో మరిన్ని వీడియోలను గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. అమ్మాయిలను ఆఫర్ల పేరుతో లోబర్చుకుంటూ వారి జీవితాలతో ఇతగాడు ఆడుకున్నాడని పోలీసులు అంటున్నారు.
Tags:    

Similar News