డేర్ ఫీట్.. ఛాలెంజ్ అంటూ నాట్యం ద‌ర్శ‌కుడిపై చిరు

Update: 2021-10-19 08:39 GMT
ఇటీవ‌లి కాలంలో ట్రైల‌ర్ తోనే ఇంప్రెష‌న్ కొట్టేసిన సినిమా నాట్యం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డ‌మే గాక‌.. ప్రీరిలీజ్ వేడుక‌లో ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి ప్ర‌చారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. తాజాగా ఆయ‌న సినిమా ద‌ర్శ‌కుడు రేవంత్ ని న‌టి సంధ్యారాజును ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ ప్ర‌య‌త్నాన్ని మెగాస్టార్ ప్ర‌శంసించారు.

నాట్యం అంటే ఒక అంద‌మైన క‌థ‌ని దృశ్య‌రూప‌కంగా చూపించ‌డం .. కొత్త ద‌ర్శ‌కుడు రేవంత్.. క్లాసిక్ డ్యాన్స‌ర్ సంధ్యా రాజు అర్థం చేసుకుని చేస్తున్నారు. క‌థ‌ను అర్థం చేసుకుని తెర‌పై చూపిస్తున్నారు. పురాణాల్లో విష‌యాల్ని ఎంట‌ర్ టైనింగ్ వేలో క‌మ‌ర్షియ‌ల్ గా చెప్పాల‌నుకునే ప్ర‌య‌త్న‌మే నాట్యం అనుకుంటున్నాను... అని చిరు అన్నారు.

నాట్యం చేయాల‌ని ఎందుకు అనిపించింది? క‌మ‌ర్షియ‌ల్ బిట్స్ తో చేశారా? అంటూ చిరు ద‌ర్శ‌కుడు రేవంత్ ని ప్ర‌శ్నంచారు. దానికి రేవంత్ ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. సాగ‌ర సంగ‌మం.. స్వ‌ర్ణ క‌మ‌లం లాంటి సినిమాలు ఇప్పుడు చేయ‌లేమ‌ని అంటారు. కానీ అలాంటి క‌థ తీసుకుని నేటి సాంకేతిక‌త‌ను టెక్నిక్ ని ఉప‌యోగించి ఒప్పించ‌గ‌లిగితే క్లాసిక్ గా నిలుస్తుంద‌ని ప్ర‌య‌త్నించాను అని యువ‌ద‌ర్శ‌కుడు తెలిపారు. ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవ‌డం డేర్ ఫీట్.. ఛాలెంజ్ అంటూ చిరు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

నాట్యం అంటే డ్యాన్స్ మాత్ర‌మే కాదు.. తెలుగు సంస్కృతిని తెలుగు ప్ర‌జ‌ల ఎమోష‌న్ తో తెలుగుద‌నంతో తీసిన నేటి జ‌న‌రేష‌న్ సినిమా ఇది. మ‌న జ‌న‌రేష‌న్ రూట్స్ ని చూపిస్తున్నాను అని రేవంత్ తెలిపారు. దీనికి స్పంద‌న‌గా చిరు యువ‌ద‌ర్శ‌కుడిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

లెజెండ‌రీ ద‌ర్శ‌కుడితో పోలుస్తున్నాన‌ని కాదు.. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా తీసారా? అని సంధ్యారాజును అడిగాను. మ‌న క‌ల్చ‌ర్ డ్యాన్స్ పై క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ కి ఉన్న ప్యాష‌న్ కానీ నెక్ట్స్ జ‌న‌రేష‌న్ కి చూపించాల‌నే ప్ర‌య‌త్నం కానీ ఎవ‌రూ చేయ‌లేరు. ఇప్పుడు రేవంత్ చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను. మ‌న క‌ళ‌లు సాంప్ర‌దాయాల్ని మ‌ర్చిపోతున్న త‌రుణంలో రేవంత్ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నారు. ఎంతో ప్యాష‌న్ తో సంధ్యారాజు ముందుకు రావ‌డం అభినంద‌నీయం అని ప్ర‌శంసించారు. డ‌బ్బు కోసం కాదు ఫ్యాష‌న్ తో అంకిత‌భావంతో ఈ సినిమా చేశారని విజ‌యం సాధించాల‌ని చిరు ఆశీస్సులు అందించారు. మెగా ప్ర‌మోష‌న్ తో నాట్యం ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News