పూరి కరక్ట్ చేసుకుని వెళ్తాడా మరి?

Update: 2017-01-21 08:05 GMT
నిజానికి ఒక విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గట్స్ ను మెచ్చుకోవాలి. ఆయన తన రీఎంట్రీ సినిమా కోసం ఎవరెన్ని చెప్పినా కూడా.. ఒక రీమేక్ కథను..రొటీన్ మసాలా స్టోరీనే ఎంచుకున్నారు. అదే కరక్ట్ అని నమ్మారు. అయితే ఆయన్ను క్రిటిసైజ్ చేసినవారు.. మెసేజ్ ఇస్తే చూస్తారా అనే వాళ్లు.. చాలామందే ఉన్నారులే. కాని చివరకు చిరంజీవి నమ్మకమే కరక్ట్ అయ్యింది. సినిమా అతి తక్కువ సమయంలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిందే చూస్కోండి.

ఇకపోతే ఖైదీ నెం 150 ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు చిరంజీడి ''ఆటో జానీ'' సినిమా గురించి కూడా స్పందించారు. ఆ సినిమా సెకండాఫ్‌ అనుకున్నట్లు రాకపోవడంతో దానిని చేయలేదని సెలవిస్తూనే.. ఒకవేళ ఖైదీ నెం 150 సినిమా చూశాక తాను ఎలాంటి మార్పులను ఆశిస్తున్నానో పసిగట్టి.. వాటిని పొందుపరిచి తీసుకొస్తే సినిమాను తప్పకుండా చేస్తానని చిరంజీవి అన్నారు. మరి ఆ మాటలను వినేసి పూరి జగన్ తన కథలో ఏమైనా మార్పులు చేసి.. కరక్షన్లను చేసుకున్న సదరు స్ర్కిప్టును చిరంజీవి దగ్గరకు తీసుకెళ్తాడా? 150 కాకపోతే 152 అయినాసేరే నేను ఆయనతో చేస్తానంటూ అప్పట్లో పలికిన పూరి జగన్.. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటేనే బెటరేమో.

మరో ప్రక్కన సురేందర్ రెడ్డి డైరక్షన్ల 151వ సినిమా.. అలాగే బోయపాటి శ్రీను డైరక్షన్లో 152వ సినిమా చేయడానికి చిరంజీవి సన్నద్దమైన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News