డ్యూయల్ రోల్ చేయడానికి మెగాస్టార్ సై

Update: 2018-06-04 06:39 GMT
తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి 2016 లో ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం సినిమాలపైనే తన దృష్టి పెట్టిన చిరు సై రా సినిమా షూటింగ్ తో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ సినిమా దేశ స్వతంత్రం కోసం బ్రిటీషర్లతో పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కితోంది.

ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ సినిమాకు సై అన్నట్టు తెలుస్తోంది. కొరటాల ఈమధ్యనే భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకోడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. అంతేకాదండోయ్. చిరు పోషిస్తున్న రెండు పాత్రల్లో ఒకటి చిన్న గ్రామంలో పొలం పనులు చేసుకునే పాత్ర కాగా, రెండవది ఎన్ ఆర్ ఐ మిలియనీర్ పాత్ర.

ఇలా రెండు వైవిధ్యమైన పాత్రలు కావడంతో, సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంటుంది. చిరంజీవి ఆఖరిసారిగా డ్యూయల్ రోల్ పోషించిన సినిమా అందరివాడు. అందులో తండ్రిగాను, కొడుకుగాను మనల్ని ఎంతగానో అలరించిన చిరు.. ఆ తరువాత ఖైదీ నెం.150లో కూడా డ్యుయల్ రోల్ చేసి మెప్పించారు. అందుకు ఇప్పుడు మళ్లీ డబుల్ యాక్షన్ అంటే.. ఫ్యాన్స్ లో మాంచి ఆసక్తి నెలకొని ఉంది.
Tags:    

Similar News