మెగాస్టార్-సుకుమార్ ప్రాజెక్ట్ సెట్ అయిందా?

Update: 2020-02-12 08:45 GMT
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తదుపరి చిత్రం ఎవరితో చేస్తారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. మెగాస్టార్ ఎవరి తో చేస్తారనే విషయం పై మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. చిరు తన నెక్స్ట్ సినిమాను సుకుమార్ తో చేసే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయట.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నరట. 'లూసిఫర్' లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటిస్తారని సమాచారం. ఈ సినిమా ను మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చే బాధ్యతను సుకుమార్ కు అప్పగించారట. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నారట.

అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు. రీమేక్ రైట్స్ చరణ్ తీసుకున్నప్పటికీ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. ఒకవేళ మెగాస్టార్ ను సుకుమార్ డైరెక్ట్ చేస్తే మాత్రం ఇది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడం లో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    

Similar News