స్నేహితుడి సినిమాకి గాత్రదానం చేయనున్న మెగాస్టార్..!!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ దేశభక్తి సినిమాను మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ అండ్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే చాలా ఏళ్ళ తర్వాత మోహన్ బాబు కథానాయకుడిగా ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు పోషించని డిఫరెంట్ పాత్రలో మోహన్ బాబు నటించడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. అయితే దేశభక్తికి సంబంధించిన కథ కానీ సినిమా గాని తెలుగులో రాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సన్ ఆఫ్ ఇండియా.. రెండో షెడ్యూల్ షూట్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. అయితే తాజాగా మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సెట్ లోకి వెళ్లి ఆయనను కలిశారట. ఎందుకు కూడా బలమైన కారణం ఉందిలెండి. మెగాస్టార్ చిరు, మోహన్ బాబు మొదటి నుండి మంచి స్నేహితులు అని తెలిసిన విషయమే. అయితే ఆ స్నేహంతోనే మోహన్ బాబు.. చిరంజీవిని తన సినిమాకు గాత్రదానం చేయాలనీ అడిగాడట. అందుకు మెగాస్టార్ కూడా హ్యాపీగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్లకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇక మెగాస్టార్ గాత్రదానం చేయడం ఇదేం కొత్త కాదు. ఇదివరకు గుంటూరోడు, ఘాజీ సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఇప్పుడు తన ఫ్రెండ్ కోసం అందించనున్నారట.