• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ చేసిన తప్పునే...

పవర్ స్టార్ చేసిన తప్పునే మెగాస్టార్ చేస్తున్నారా...?

By - Tupaki Desk
Update: 2020-07-19 15:30 GMT
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' కరోనా కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాగా 'ఆచార్య' తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా 'లూసిఫర్' తెలుగు రీమేక్ కి 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారని.. ప్రస్తుతం 'లూసిఫర్' స్క్రిప్ట్ లో మన నేటివిటీకి తగ్గట్లు సుజీత్ మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ చేస్తున్నాడనే వార్తలతో మెగా అభిమానులు కలవరపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే మోహన్ లాల్ హీరోగా పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలయాళ 'లూసిఫర్' సూపర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ హోమ్ బ్యానర్ కొణిదల ప్రొడక్షన్స్ వారు పోటీపడి మరీ సొంత చేసుకున్నారు. ఇక 'ఆచార్య' కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ 'లూసిఫర్' పేరుతో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన జనాలు ఇప్పటికే ఈ సినిమాని చూసేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే 'లూసిఫర్' సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. స్టోరీలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఆల్రెడీ ఆ సినిమా ప్రేక్షకులు చూసిందే అవుతుంది కదా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇంతకముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలానే ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజైన సినిమా రీమేక్ చేసి బొక్కబోర్లా పడ్డారని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ - తమన్నా జంటగా నటించిన తమిళ్ మూవీ 'వీరమ్' సినిమాని 'వీరుడొక్కడే' పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేసారు. అయినా ఇవేమీ పట్టించుకోని పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేసి ఎలాంటి రిజల్ట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆల్రెడీ జనాలు చూసేసిన 'లూసిఫర్' ని రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ చేసిన తప్పే చిరు కూడా చేయబోతున్నారని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ కి వచ్చిన రిజల్టే మెగాస్టార్ కి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. గతంలో చిరంజీవి 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' అనే రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ అవి తెలుగులో అంతకముందు డబ్బింగ్ ఐన సినిమాలు కాదు. కానీ ఇప్పుడు 'లూసిఫర్' తెలుగులో డబ్ అయింది. మరి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోరిక మేరకు ఈ రీమేక్ విషయంలో పునరాలోచన చేస్తారేమో చూడాలి.


Tags:    
  • Chiranjeevi 
  • Pawan Kalyan 
  • Lucifer Remake 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS