త్రిష పై చిరంజీవి గాంధీగిరి చూపిస్తున్నాడా?

Update: 2020-05-07 05:50 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య నుండి త్రిష అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెల్సిందే. సృజనాత్మక విభేదాల కారణంగానే తాను ఆచార్య నుండి తప్పుకున్నట్లుగా త్రిష ట్వీట్‌ చేసి మరీ సినిమాను వదిలేసింది. ఆ విషయం పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది. ఆ సంఘటన ఆచార్య సినిమాకే ఒక చెడ్డ పేరును తెచ్చి పెట్టింది. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా త్రిష విషయంలో చాలా సీరియస్‌ గా ఉంటారని అంతా భావించారు. కాని మెగాస్టార్‌ మాత్రం తన మంచి మనస్సును చాటుకుంటున్నాడు.

సాదారణంగా ఏ హీరోకు అయినా ఒక హీరోయిన్‌ తన సినిమాను వదిలేస్తే ఈగో హర్ట్‌ అవుతుంది. ఖచ్చితంగా ఆ హీరోయిన్‌ పై కోపంగా ఉంటారు. ఇక స్టార్‌ హీరోలైతే ఆ హీరోయిన్‌ కు ఇతర హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్‌ రాకుండా చేయాలని అనుకుంటారు. కాని మెగాస్టార్‌ మాత్రం త్రిష విషయంలో విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచార్య నుండి త్రిష తప్పుకున్నా కూడా ఆమెపై ఏమాత్రం కోపం ఉన్నట్లుగా కనపడటం లేదు. కొన్ని రోజుల క్రితం త్రిష ఒక పెద్ద సినిమాలో ఆఫర్‌ రావడం వల్ల వెళ్లి పోయింది తప్ప యూనిట్‌ సభ్యుల్లో ఎవరితోనూ గొడవ లేదని అన్నాడు.

తాజాగా త్రిష పుట్టిన రోజు సందర్బంగా చిరు.. జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషంతో విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నీకు మరింత గొప్పగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ గొప్ప మనసుతో శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరు విశెష్‌ కు త్రిష స్పందిస్తూ స్వీటెస్ట్‌ లెజెండ్‌ చిరంజీవికి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేసింది.

చిరంజీవి త్రిష పై చిరు కోపంను కూడా ప్రదర్శించక పోవడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఇక కొందరు మెగాఫ్యాన్స్‌ త్రిష విషయంలో శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రం తరహాలో గాంధీగిరిని ఫాలో అవుతున్నాడా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. చిరు గాంధీగిరికి త్రిష తాను తప్పు చేశానని తెలుసుకుంటుందని మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News