హస్త ప్రయోగం అంటూ ప్రైవేట్ పార్ట్‌కు వాతలు.. యువతి ఆందోళన.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్

Update: 2021-04-26 00:30 GMT
మ‌హిళలు ఎదుర్కొనే ప్ర‌తీ విష‌యంపై సామాజిక బాధ్య‌త‌తో స్పందిస్తుంటారు సింగ‌ర్ చిన్మయి. స‌మాజంలో బాలిక‌లు మొద‌లు అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వివ‌క్ష‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర్ద్వందంగా ఖండిస్తుంటారామె. ఇటీవ‌ల ‘ఫ‌న్ బ‌కెట్ భార్గ‌వ్’ అంశంపై స్పందించిన చిన్మయి.. అలాంటి వాళ్లు చాలా డేంజర్ అని చెప్పింది. తాజాగా.. ఓ అమ్మాయి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చిన్మయి దృష్టికి తీసుకెళ్లింది.

తాను ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు స్థంభంపై పాకుతూ ఆట ఆడిన‌ట్టు చెప్పింది. అయితే.. అది చూసిన ఓ ఆంటీ వెళ్లి వాళ్ల అమ్మ‌కు చెప్పింద‌ట‌. తాను హ‌స్త ప్ర‌యోగం చేసుకుంటున్నాన‌ని వాళ్ల అమ్మ‌కు కంప్లైంట్ చేసింద‌ట‌. దీంతో.. ఆగ్ర‌హంతో ఊగిపోయిన వాళ్ల అమ్మ‌.. ఏకంగా ప్రైవేటు పార్ట్ మీద వాత పెట్టింద‌ట‌!

దాని వ‌ల్ల ఎంతో నొప్పి క‌లిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది స‌ద‌రు యువ‌తి. కొన్నాళ్ల‌పాటు యూరిన్ పాస్ చేయ‌డానికి కూడా ఇబ్బంది ఎదుర్కొన్న‌ట్లు చెప్పింది బాధితురాలు. ఈ విష‌యం విన్న చిన్మ‌యి తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

ఆ ఆంటీతోపాటు వాళ్ల అమ్మ త‌న‌కు క‌నిపిస్తే.. సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్తాన‌ని చెప్పారు. అమ్మాయి ప్రైవేటు పార్ట్ ను కాల్చాల్సినంత త‌ప్పు ఏం చేసింద‌ని నిల‌దీసింది.
Tags:    

Similar News