సెల‌బ్రిటీలు ఇద్ద‌రు ఎంత సింఫుల్ గా పెళ్లి చేసుకున్నారంటే?

Update: 2019-06-10 12:24 GMT
వారిద్ద‌రూ సెల‌బ్రిటీలు. సినీన‌టిగా.. టీవీ న‌టిగా ఆమె ఫేమ‌స్. మోడ‌ల్ ఆయ‌న అంద‌రికి సుప‌రిచితం. దానికి మించి మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ సోద‌రుడిగా అంద‌రికి తెలుసు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారి పెళ్లి ఎంత హంగు.. ఆర్భాటంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకు భిన్నంగా చాలా సింఫుల్ గా.. జ‌స్ట్ దండ‌లు.. అవి కూడా బంతిపూల దండ‌లు మార్చుకొని.. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా.. చ‌ట్ట‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకున్న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

సుస్మితా సేన్ సోద‌రుడు క‌మ్ మోడ‌ల్ అయిన రాజీవ్ సేన్.. త‌న స్నేహితురాలు క‌మ్ టీవీ.. సినీ న‌టి అయిన చారు అసోపాను కోర్టు మ్యారేజ్ ద్వారా పెళ్లాడారు. అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి చాలా నిరాడంబ‌రంగా సాగ‌టం విశేషంగా చెప్పాలి. త‌న పెళ్లి గురించి రాజీవ్ సేన్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు.

నేను.. రాజీవ్ సేన్. చారు అసోపాను లీగ‌ల్ గా భార్య‌ను చేసుకున్నా అంటూ ఆయ‌న ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంటూ పెళ్లి ఫోటోలు కొన్నింటిని షేర్ చేశారు. దీంతో.. వీరి ఆద‌ర్శ వివాహానికి నెటిజ‌న్లు జై కొడుతున్నారు. ప్ర‌ముఖులంతా త‌మ పెళ్లిళ్ల కోసం కోట్లాది రూపాయిలు ఖ‌ర్చుచేస్తున్న వేళ‌లో అందుకు భిన్నంగా సింఫుల్ గా చేసుకున్న వీరి పెళ్లి ముచ్చ‌ట ఇప్పుడు హైలెట్ గా మారింది.

ఇన్ని అవ‌కాశాలు ఉండి కూడా.. పెళ్లిని ఇంత నిరాడంబ‌రంగా చేసుకున్న మీ జంట నిజంగా ఆద‌ర్శ‌నీయం అంటూ ప‌లువురు అభినందిస్తున్నారు. ఏడాది కాలంగా  ఈ ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నారు. తాజాగా పెట్టిన పోస్ట్ ప్రకారం వీరిద్ద‌రి పెళ్లి ఈ నెల 7న జ‌రిగిన‌ట్లుగా ఉంది. బుల్లితెర న‌టిగా గుర్తింపు పొందిన చారు అసోపా.. మోడ‌ల్ గా సుప‌రిచితుడైన రాజీవ్ సేన్ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌న్న మాట ప‌లువురి నోట‌వినిపిస్తోంది.


Tags:    

Similar News