• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భర్త పెట్టిన టార్చర్...

భర్త పెట్టిన టార్చర్ చెప్పుకొని కన్నీరు పెట్టుకున్న నటి

By - Tupaki Desk
Update: 2022-11-02 11:30 GMT
సాదాసీదా బతుకుల మాదిరే తారల జీవితాలు ఉంటాయి. చూసేందుకు అందనంత దూరాన ఉన్నట్లుగా కనిపిస్తూ మెరుపులు మెరిపించే తారల జీవితాలు రంగులమయంగా ఉంటాయని అనుకుంటాం. కానీ.. వారికి సైతం సాదాసీదా జనాల మాదిరే సమస్యల్లో కిందా మీదా పడుతుంటారు. అందానికి అందం.. అంతకు మించిన ఇమేజ్ తో పాటు.. సెలబ్రిటీ గుర్తింపు.. కోరుకున్నంత డబ్బు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితాల్లో కొందరు ఎదుర్కొనే సమస్యల్ని చూసినప్పుడు.. అయ్యో అనుకోకుండా ఉండలేం. ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

బుల్లితెర సీరియల్ నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా వైవాహిక జీవితం ఎంత కష్టంగా ఉందన్న విషయం ఆమె మాటల్లో వింటే అయ్యో అనుకోకుండా ఉండలేం. మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ఆమె భర్త. పెళ్లైన నాటి నుంచి అతను పెట్టిన ఇబ్బందుల గురించి చెబుతూ.. బోరుమంది.

వివాహం జరిగిన నాటి నుంచి అతను తనను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారని పేర్కొంది. అతను పెట్టే టార్చర్ ను వివరంగా పంచుకున్న ఆమె అనుభవం గురించి వింటే.. దేవుడా అనుకోకుండా ఉండలేం.

తన మీద కోపం వచ్చిన ప్రతిసారీ ఆమెను వదిలి వెళ్లిపోయేవాడట. ఎక్కడకు వెళ్లాడన్న విషయం తెలిసేది కాదట. ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసేవాడట. అతను ఏమయ్యాడోన్న ఆందోళనతో కుంగుబాటుకు గురయ్యేదానినని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ తనను వదిలేసి దాదాపు మూడు నెలల పాటు దూరంగా ఉన్నారన్నారు. అతడి కారణంగా తన కెరీర్ మొత్తం నాశనమైందని చెబుతూ కన్నీటిపర్యంతమైన ఆమె.. తాను మళ్లీ పని చేయటం మొదలు పెట్టిన తర్వాత మళ్లీ తన వద్దకు తిరిగి వచ్చినట్లుగా చెప్పారు.

నాకు దూరంగా ఉండాలంటూ నాతో నటించే సహ నటీనటులకు మెసేజ్ లు పెట్టేవాడని.. దీంతో.. తనను ఒక సమస్యగా చిత్రీకరించటం ద్వారా తనకు అవకాశాలు రాకుండా చేశాడని వాపోయింది. అతడు పెట్టే టార్చర్ తాను భరించలేక.. విడాకులకు అప్లై చేసినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. తన వద్దకు వచ్చి.. తనను బాగా చూసుకుంటానని మాటివ్వటంతో మళ్లీ కలిశామని.. కానీ కొద్ది రోజులకే మళ్లీ బాధ పెట్టటం షురూ చేశాడని చెప్పింది. అందుకే.. ఇప్పుడు విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. భర్త నుంచి దూరం కావాలని డిసైడ్ అయిన ఆమె రానున్న రోజుల్లో కోరుకున్న జీవితాన్ని సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • CharuAsopa 
  • RajeevSen 
  • CelebrityCouple 
  • CharuAsopaAboutHerMarriageLife 
  • RajeevSenTortureHisWife 
  • CharuandRajeevSenDivorce 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS