18 ఏళ్ళ క్రితం జూనియర్ ఆర్టిస్టుగా..

Update: 2019-05-27 16:05 GMT
సీనియర్ హీరోయిన్ ఛార్మీ గురించి కొత్తగా ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. తన కెరీర్లో 55 సినిమాల్లో నటించిన ఛార్మీ ఈరోజుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది.  సరిగ్గా 18 ఏళ్ళ క్రితం ఈరోజే ఛార్మీ మొదటిసారిగా కెమెరా ను ఫేస్ చేసిందట.  ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్ లో 500 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఒకరిగా షూటింగ్ లో పాల్గొన్నానని ఛార్మి తెలిపింది. ఆ సమయంలో కొందరు బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఉన్నారట.

సమ్మర్ హాలిడేస్ కావడంతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొంటానని.. ఆ తర్వాత పేరెంట్స్ చెప్పినట్టే స్కూల్ కంటిన్యూ చేస్తానని పేరెంట్స్ తో చెప్పిందట.  సరే అని ఒప్పుకున్న పేరెంట్స్ ఛార్మి సోదరుడిని షూటింగ్ కు తోడుగా పంపారట.  అయితే ఒక్కసారి కెమెరాను ఫేస్ చేసిన తర్వాత తన అదో ప్రత్యేకమైన లోకంలా తోచిందట.  ఆరోజే ఛార్మీ ఎలాగైనా హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందట. ఆరోజు ఛార్మీ అందుకున్న రెమ్యూనరేషన్ రూ. 200.  

అప్పటి నుంచి తన కుటుంబ సభ్యుల మద్దతుతో.. సన్నిహితుల సహకారంతో సినీ రంగంలో తన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పింది.  ఛార్మీ ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా తెలుపుతూ ఛార్మీ ఒక ట్విట్టర్ లో ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది.  ఈ 18 ఏళ్ళలో ఛార్మీ ఎంతో సాధించింది.  అయితే ఇంత పెద్ద ప్రయాణం కూడా ఆ రూ.200 రెమ్యూనరేషన్ తో మొదలయింది. అందుకే ఇంగ్లీష్ లో  "థౌజండ్ మైల్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్" అని ఒక కొటేషన్ ఉంది. గొప్ప గొప్ప ప్రయాణాల ప్రారంభాలు ఎప్పుడూ చాలా సింపుల్ గా ఉంటాయి.  ఛార్మీ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని నిర్మాతగా కూడా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.  


Tags:    

Similar News