మహేష్‌ నిర్మాణంలో చరణ్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Update: 2020-04-30 07:00 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో పలువురికి హోం బ్యానర్స్‌ ఉన్నాయి. మహేష్‌ బాబు.. చరణ్‌.. ప్రభాస్‌ ఇలా పలువురు నిర్మాణ సంస్థలు కలిగి ఉన్నారు. అయితే మహేష్‌ బాబు మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించలేదు. తన సినిమాలకు సహ నిర్మాణ సంస్థగా మాత్రమే ఆయన నిర్మాణ సంస్థ పేరు వేశారు. కాని త్వరలోనే మహేష్‌ బాబు నిర్మాణంలో రామ్‌ చరణ్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది.

ఆ ప్రచారం ప్రకారం.. మహేష్‌ బాబు 27వ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాల్సి ఉంది. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది. షూటింగ్‌ కు త్వరలో వెళ్తారనుకున్న సమయంలో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.. పరశురామ్‌ దర్శకత్వంలో మహేష్‌ 27కు రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లితో సినిమాను మహేష్‌ క్యాన్సిల్‌ చేసుకోవడం వెనుక కారణం ఉందట. అదేంటంటే వంశీ రెడీ చేసిన స్క్రిప్ట్‌ చాలా బాగుందట. కాని అది తనకు సెట్‌ అవ్వదని చరణ్‌ కు అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్‌ ను అటు పంపించాడట.

మహేష్‌ బాబు సూచన మేరకు వంశీ పైడిపల్లి చెప్పిన ఆ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ కథను విన్న చరణ్‌ ఇంప్రెస్‌ అయ్యి నటించేందుకు ఓకే చెప్పాడట. అయితే ఈ సినిమాకు మాత్రం తానే నిర్మాతగా వ్యవహరిస్తానంటూ మహేష్‌ బాబు అన్నాడట. చరణ్‌ కూడా అందుకు దాదాపుగా ఓకే అన్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంను చేస్తున్న చరణ్‌ ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు బ్యానర్‌ లో సినిమా చేసే అవకాశం ఉందంటున్నారు. చరణ్‌ కు కూడా సొంత బ్యానర్‌ ఉంది కనుక ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా చరణ్‌ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఈ విషయంలో నిజమెంత అనే విషయం అనేది మెగా కాంపౌండ్‌ లేదా సూపర్‌ స్టార్‌ వర్గాల వారు స్పందిస్తే కాని తెలియదు.
Tags:    

Similar News