సినిమా హాల్స్, మాల్స్ పై కీలక నిర్ణయం దిశగా కేంద్రం?
దేశాన్ని కరోనా లాక్ డౌన్ నుంచి గాడినపెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రెడ్ జోన్ మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వర్తక వ్యాపారాలు తెరిచేలా సడలింపులు ఇచ్చింది. గ్రీన్ జోన్ లో అయితే అన్నింటిని సర్వం తెరిచేలా మునుపటిలా నడిపించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.
తాజాగా గ్రీన్ జోన్లలో మాల్స్, సినిమా హాల్స్ మరియు స్థానిక రిటైల్ దుకాణాలను రాత్రిపూట తెరవడానికి అనుమతించడానికి ప్రభుత్వం అంతర్గత చర్చలు ప్రారంభించినట్టు తెలిసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ కార్యకలాపాలను ప్రారంభించడానికి కేంద్రం యోచిస్తోంది. ఆరోగ్యశాఖ కసరత్తు తర్వాత హోంశాఖ ప్రకటన వెలువరించనుంది.
ఇందులో భాగంగా రద్దీని తగ్గించడానికి ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు షాపులు ఓపెన్ చేయాలని.. రిటైల్ దుకాణాలను సైతం తెరిపించడానికి అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇలా మాల్స్, రిటైల్ షాపులు రాత్రి 12 గంటలకు వరకు ఉంచితే రద్దీ తగ్గి భౌతిక దూరం పాటిస్తూ కరోనా భయం ఉండదని కేంద్రం భావిస్తోంది.
కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో రిటైల్ రంగంపైనే దేశంలో దాదాపు 30శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి చూపించే ఈ రంగాన్ని ఓపెన్ చేయడానికి కేంద్రం తీవ్రంగా సమాలోచనలు చేస్తోందని సమాచారం.