‌ హీరోయిన్ సంజ‌న‌ ఇంట్లో డ్ర‌గ్ సోదాలు

Update: 2020-09-08 05:15 GMT
క‌న్న‌డ చిత్ర సీమ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప‌లువురు సినీ తార‌లు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ డ్ర‌గ్స్ వాడ‌తారంటూ ఇటీవ‌ల ప‌ట్టుబ‌డిన ఓ డ్ర‌గ్స్ ముఠా కీల‌క స‌మాచారాన్ని పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించ‌డంతో అస‌లు డొం క‌దిలింది. శాండ‌ల్ వుడ్‌లో డ్ర‌గ్స్ తో ఎవ‌రెవ‌రికి లింక్స్ వున్నాయ‌న్న కోణంలో సీసీబీ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

ఇప్ప‌టికే క‌న్న‌డ చిత్ర సీమ‌లో ప‌లువురి ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ ముఠాతో సంబంధాలు వున్నాయ‌న్న అనుమానం వున్న వారిని వ‌రుస‌గా అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా న‌టి రాగిణి దివ్వేదీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా న‌టి సంజ‌న ఇంటిలోనూ  సీసీబీ పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సంజ‌న ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు బెంగ‌ళూరు ఇందిరాన‌గ‌ర్‌లోని సంజ‌న ఇంట్లో సోదాలు మొద‌లుపెట్టారు.

ఈ సోదాలు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాయి. కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని అదుపులోకి తీసుకోవ‌డం గ్యారెంటీ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో డిజైన‌ర్ నియాజ్‌ని అరెస్ట్ చేశారు. కేర‌ళ‌కి చెందిన నియాజ్ న‌టి రాగిణితో స‌హా ప‌లువురికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు.
Tags:    

Similar News