• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్: శీలాన్ని కాపాడే...

ట్రైలర్: శీలాన్ని కాపాడే సింబలే 'క్యాలీఫ్లవర్'

By - Tupaki Desk
Update: 2021-11-20 05:38 GMT
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ''క్యాలీఫ్లవర్''. ‘శీలో రక్షతి రక్షిత:’ అనే ఉపశీర్షికతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. నవంబర్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విభిన్నమైన ప్రమోషనల్ కార్యక్రమాలతో దూసుకుపోతున్న చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

సంపూర్ణేష్ బాబు శైలికి తగ్గట్లుగా సాగే విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో 'క్యాలీఫ్లవర్' సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో తన గ్రామ ప్రజల శీలాలను కాపాడే క్యాలీ ఫ్లవర్.. పెళ్లి తర్వాత తన శీలాన్నే పోగొట్టుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై క్యాలీ ఫ్లవర్ చేసిన పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది.

సంపూర్ణేష్ బాబు అసెంబ్లీ ముందు ధర్నా చేయడం చూస్తుంటే.. మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో క్యాలీ ఫ్లవర్ పోరాటం చేయనున్నాడని అర్థం అవుతుంది. శీలం ఆడాళ్లకే కాదు.. మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే విభిన్నమైన కాన్సెప్టుతో ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాని తీశారని తెలుస్తోంది. చివర్లో ఇంగ్లీష్ దొరబాబు గెటప్ లో కనిపించి ఇందులో మరో పాత్ర ఉంటుందని హింట్ ఇచ్చారు.

పోసాని కృష్ణ మురళి - పృథ్వీ - నాగ మహేష్ - గెటప్ శ్రీను - రోహిణి - కాదంబరి కిరణ్ - కల్లు కృష్ణారావు - విజయ్ - కళ్యాణి - సుమన్ మన్వాడ్ - ముస్కాన్ - బేబీ సహ్రుదా - రమణ్ దీప్ కౌర్ 'క్యాలీ ఫ్లవర్' చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రజ్వల్ క్రిష్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించగా.. బాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. గూడురు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్ - రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 'హృదయ కాలేయం' 'సింగం 123' 'కొబ్బరిమట్ట' వంటి చిత్రాలతో అలరించిన సంపూ.. 'క్యాలీఫ్లవర్' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Full View
Tags:    
  • Sampoornesh Babu 
  • Cauliflower 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS