పెళ్లి చేసుకోమని షంటేస్తున్నారట
కుర్రాళ్ల గుండెల్లో హాటెస్ట్ ఎమ్మెల్యేగా క్యాథరీన్ థ్రెసా ఇంకా కొలువుండనే ఉంది. అయినా ఎందుకనో ఈ అమ్మడి టాలీవుడ్ కెరీర్ పూర్తి డైలమాలో పడిపోయింది. రెండు మూడేళ్లుగా కేథరిన్ కెరీర్ నత్తనడకన సాగుతోంది. అంది వచ్చిన అవకాశాలతోనే అడ్జస్ట్ అవుతోంది. ఇటీవలే `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చినా ఈ భామకు ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే బాలకృష్ణ 106వ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ కోసం సంప్రదించగా కోటిన్నర డిమాండ్ చేసిందని ప్రచారమైంది. ఫేడవుట్ బ్యూటీకి అంత పెద్ద పారితోషికం దేనికి? అంటూ బోయపాటి లైట్ తీస్కున్నాడట. అలా వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని వదులుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నా కాలం కలిసి రావడం లేదు.
ఆశించిన రేంజు ఛాన్స్ అయితే రావడం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలగి పోవాలని కలలు గన్నా అవేవీ నెరవేరడం లేదు. అనుకున్న స్టేటస్ మాత్రం కేథరీన్ అందుకోలేకపోయింది. దాదాపు కెరీర్ చివరి దశకు చేరుకుంది. దాంతో పాటే ఏజ్ బార్డర్ క్రాస్ చేస్తోంది కాబట్టి తదుపరి ఘట్టం పెళ్లి చేసుకుని ఓ ఇంటిది కావడమేనని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయంపై కేథరీన్ స్పందించింది. అవును నిజమే.. పెళ్లి చేసుకోమని ఇంట్లోవాళ్లు కూడా షంటేస్తున్నారు. అయితే వాయిదా వేస్తూ వస్తున్నానని తెలిపింది.
ఇప్పటి వరకూ ఎవరితోనూ ప్రేమలో పడలేదా? అంటే.. లేదు అనే సమాధానం ఇచ్చింది. అలాగని ప్రేమ అంటే గిట్టదని కాదు.. ప్రేమపై ద్వేషం ఉందని కాదు..మనసుకు నచ్చిన అబ్బాయి దొరకలేదు. అలాంటి వాడు కనిపిస్తే కచ్చితంగా ప్రేమిస్తా. కానీ అప్పటివరకూ ఇంట్లో వాళ్లు వెయిట్ చేస్తారో లేదో? ప‌్రేమ పెళ్లా! పెద్దల చూసిన వాడినే పెళ్లాడతానో నా చేతుల్లో లేదని ఆ భారమంతా దేవుడు పైనే వేసానని అంది.ఈ మాటలను బట్టి కేథరీన్ పెళ్లికి సిద్దంగానే ఉందని ఓ హింట్ దొరికేసినట్టే.