ఆ యంగ్ డైరెక్ట‌ర్ పై ఎందుకు ఇంత‌ సింప‌థీ

Update: 2020-06-29 07:50 GMT
డెబ్యూ మూవీ మొత్తం ఆన్ లైన్ లో లీకైపోయింది. ఇక అయిపోయిన‌ట్టే అనుకున్నారంతా. ఆ హీరోతో పాటు తొలి చిత్ర ద‌ర్శ‌కుడు అయిన ఆ కుర్ర డైరెక్ట‌ర్ అయిపోయాడు! అనే ప్ర‌చార‌మైంది. కానీ అలా లీకైన త‌ర్వాత కూడా ఆ మూవీ బంప‌ర్ హిట్ కొట్టింది. నిర్మాత‌ల జేబులు నింపింది. దీంతో ఫుల్ ఖుషీ అయిపోయిన నిర్మాత‌లు అదే దర్శ‌కుడికి మ‌రో ఆఫ‌ర్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే అత‌డు ఇత‌ర బ్యాన‌ర్ల‌కు క‌మిట‌య్యాడు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క్లాసిక్ చిత్రాలు తీస్తున్న ఓ బ్యాన‌ర్ తో పెట్టుకున్నాడు ఈ కుర్ర డైరెక్ట‌ర్. పైగా ఇందు లో స‌హ‌జం గా న‌టించే హీరో తో ట్ర‌య‌ల్. పైగా ఇది రెండో మూవీ. అయితే ఆదిలోనే ఈ ప్రాజెక్టుపై ర‌క‌ర‌కాల సంశ‌యాలు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యం గా స‌ద‌రు కుర్ర డైరెక్ట‌ర్ పై నెటిజ‌నులు కాస్త సింప‌థీని వ్య‌క్తం చేయ‌డం ఇక్క‌డ కొస‌మెరుపు.

డెబ్యూ మూవీని అలా హిట్ గా తీర్చి దిద్దడం లో ఆ యువ‌ డైరెక్టర్ కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో..! ప్రొడక్షన్ టీం కి అంతే క్రెడిట్ ఇవ్వాలి అంటూనే... ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేసిన తాజా మూవీ స‌న్నివేశ‌మేమిటో! అంటూ పెద‌వి విరిచేస్తున్నారు. ఆ హీరోతో అత‌డు ఎలా వర్క్ చేస్తాడో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. స‌ద‌రు హీరో కి ఉన్న ఫింగరింగ్ కి మనోడు ఎలా సెట్ అవుతాడో చూడాలి!! అంటూ ఒక‌టే గుస‌గుస‌. అస‌లే సెకండ్ మూవీ `ఫ్లాప్ సెంటిమెంట్` టెన్ష‌న్ ఇండ‌స్ట్రీలో ఆల్వేస్ హాట్ టాపిక్. అందుకే ఈ గండాన్ని గ‌ట్టెక్కేందుకు ఆ యువ డైరెక్ట‌ర్ ఎలాంటి టెక్నిక్ ప్లే చేస్తాడు? అన్న‌ది కాస్త ఆగితే కానీ తేల‌దు. పైగా ఫింగ‌రింగ్ హీరో తో స‌వాల్ ని ఎలా నెగ్గుతాడు? అన్న‌దే అస‌లు సిస‌లు టాస్క్.
Tags:    

Similar News