• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పార్క్ ఓటీటీలో బిగ్...

స్పార్క్ ఓటీటీలో బిగ్ బాస్ దివి 'క్యాబ్ స్టోరీస్'

By - Tupaki Desk
Update: 2021-05-18 05:34 GMT
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతబడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే ఈ రంగంలో కొన‌సాగుతున్న ఓటీటీ వేదిక‌ల‌కు పోటీగా 'స్పార్క్' అనే ఓటీటీ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు నేతృత్వంలోని ఈ ఓటీటీ.. ఇటీవలే 'డి కంపెనీ' సినిమాతో ఘనంగా ప్రారంభమైంది. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన 'స్పార్క్' న్యూ ఏజ్ కంటెంట్ ని అందించడానికి రెడీ అయింది. ఈసారి ''క్యాబ్ స్టోరీస్'' అనే సరికొత్త ఒరిజినల్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తోంది.

''క్యాబ్ స్టోరీస్'' లో బిగ్ బాస్-4 ఫేమ్ దివి వధ్య ప్రధాన పాత్రలో నటించగా.. గిరిధర్ - ధన్ రాజ్ - ప్రవీణ్ - శ్రీహాన్ - సిరి ఇతరపాత్రలు పోషించారు. కొత్త కాన్సెప్ట్‌ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందించబడిన ఈ సిరీస్ మే 28న 'స్పార్క్' ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి కె.వి.ఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. 'గాలి సంపత్' సినిమాతో నిర్మాతగా మారిన ఎస్ కృష్ణ.. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తొలి ఓటీటీ ప్రొడక్ట్ గా 'క్యాబ్ స్టోరీస్' ని నిర్మించారు.

'క్యాబ్ స్టోరీస్' చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సక్సెస్ ఫుల్ 'డి కంపెనీ' తర్వాత 'స్పార్క్' లో వచ్చే సిరీస్ కావడం.. బిగ్ బాస్ తో అందిరికి సుపరిచితమైన దివి ఇందులో నటించడంతో 'క్యాబ్ స్టోరీస్‌' పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇళ్ల‌ల్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదించే వారికి పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చేందుకు, ప‌క్కా ప్లాన్ తో స్పార్క్ ఓటీటీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా క‌థా క‌థ‌నాల ఎంపిక చేసుకుంటూ.. ఒరిజిన‌ల్స్ తో పాటు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను ఐదు భాష‌ల్లో అందించడానికి రెడీ అయ్యారు.
Tags:    
  • Cab Stories 
  • Spark OTT 
  • Cab Stories Release Date 
  • India 
  • Tollywood 
  • Telugu News 

Similar News

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

Copyright @2026

Powered by Blink CMS