• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ నిర్మాతకు భలే ఆఫర్

అఖిల్ నిర్మాతకు భలే ఆఫర్

By - Tupaki Desk
Update: 2018-07-21 06:19 GMT
నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న నిర్మాతలు ఎందరో ఉన్నారు. పెట్టిన ఖర్చు వెనక్కు రావడానికి ఉన్న మార్గం వసూళ్లు ప్లస్ హక్కులు. అంతకు మించి వేరే మార్గం ఉండదు. కానీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ కు మాత్రం ధనలక్ష్మి లండన్ ప్రభుత్వం రూపంలో తలుపు తట్టింది. అదెలా అంటారా. చూద్దాం. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో  సినిమా నిర్మిస్తున్న ప్రసాద్ గారి టీమ్ ప్రస్తుతం దాని షూటింగ్ కోసం గత కొంత కాలంగా లండన్ లో మకాం వేసిన సంగతి తెలిసిందే. కథలో కీలక భాగం అక్కడే జరగాల్సి ఉండటంతో భారీ వ్యయంతో అది కొనసాగిస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం లండన్ పార్ట్ కే 20 కోట్ల దాకా బడ్జెట్ అవుతోందట. వామ్మో అంతనా అనిపించడం సహజం. కానీ లండన్ ప్రభుత్వం నుంచి వచ్చిన  తీయని కబురు ప్రసాద్ ని గట్టెక్కిస్తోంది.

తమ దేశంలో షూటింగ్ జరుపుకునే విదేశీ సినిమాలకు అందుకు అయ్యే బడ్జెట్ లో సగం అంటే 50 శాతం రీ ఫండ్ చేసే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే ప్రసాద్ గారు పెడుతున్న దాంట్లో 10 కోట్లు అధికారికంగానే వెనక్కు వస్తుందట. రెండు చిన్న సినిమాలు తీసేంత మొత్తం వచ్చి పడటం అంటే మాటలు కాదుగా. ఇది ఖచ్చితంగా నిర్మాతకు మేలు చేసేదే. ఇలాంటి వెసులుబాటు ఇప్పుడు వచ్చింది కాదు. గతంలో ప్రసాద్ గారే నిర్మించిన నాన్నకు ప్రేమతో తొలిప్రేమ సినిమాలకు కూడా వచ్చింది కానీ మరీ 50 శాతం కాదట. అందుకే అఖిల్ మూవీకి ఇంతేసి మొత్తం రావడం పట్ల మహా ఆనందంగా ఉన్నారు ప్రసాద్. అక్కడ షెడ్యూల్  పూర్తయ్యాక హైదరాబాద్ లో జరిగే బాలన్స్ తో షూటింగ్ పూర్తయిపోతుంది. మిస్టర్ మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దాన్ని మార్చే ఆలోచనలో ఉంది టీమ్.
Tags:    
  • BVSN Prasad 
  • London Govt 
  • Shooting Expenses 

Similar News

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS