ఆ హీరోయిన్ కు నెల‌కు రూ.25 ల‌క్ష‌లు ఇస్తాన‌న్న వ్యాపార‌వేత్త.. అందుకేనా?

Update: 2022-07-15 01:30 GMT
శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గోదావ‌రి, రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌చ్చిన స‌త్య‌మేవ జ‌య‌తే త‌దిత‌ర తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో న‌టించింది.. బిహార్ భామ నీతూ చంద్ర‌. అంతేకాకుండా చంపార‌న్ టాకీస్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌసును ఏర్పాటు చేసి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా నిర్మించిన మైథిలి భాషా చిత్రం.. మిథిలా మ‌ఖాన్ జాతీయ అవార్డును కూడా కొల్ల‌గొట్టింది.

కాగా ఇటీవ‌ల ఒక బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో నీతూ చంద్ర‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బాగా డ‌బ్బున్న వ్యాపార‌వేత్త ఒక‌రు త‌న‌కు నెల‌కు 25 ల‌క్ష‌ల రూపాయ‌లు వేత‌నంగా ఇస్తాన‌ని... ఆయ‌న‌కు భార్యగా ఉండాల‌ని ఆఫ‌ర్ చేశాడ‌ని బాంబు పేల్చింది. వేత‌నం తీసుకునే భార్య‌గా ఉండాల‌ని త‌న‌ని కోరిన‌ట్లు వెల్ల‌డించ‌డంతో బాలీవుడ్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌యింది.

అయితే ఆ వ్యాపార‌వేత్త ఆఫ‌ర్ ను తాను తిర‌స్క‌రించాన‌ని నీతూ చంద్ర వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్ విజ‌యాలు, అప‌జ‌యాల‌తో సాగుతూ వ‌చ్చింద‌ని గుర్తు చేసింది.

జాతీయ అవార్డులు సాధించిన 13 మంది పెద్ద న‌టుల‌తో న‌టించాన‌ని.. ప‌లువురు స్టార్ హీరోల‌తో కూడా న‌టించాన‌ని నీతూ చంద్ర వ్యాఖ్యానించింది. అయితే ప్ర‌స్తుతం త‌న‌కు అవ‌కాశాలు లేవ‌ని ఖాళీగా ఉన్నాన‌ని పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో ఒక పెద్ద వ్యాపార‌వేత్త త‌న‌ను శాల‌రీడ్ వైఫ్ గా ఉండ‌మ‌ని కోరాడ‌ని.. నెల‌కు 25 ల‌క్ష‌ల చొప్పున ఇస్తాన‌ని తెలిపాడ‌ని ఈ భామ తెలిపింది. అప్పుడు త‌న‌ దగ్గర డబ్బూ.. పనీ రెండూ లేవ‌ని వెల్ల‌డించింది. కాగా నీతూ చంద్ర టాలీవుడ్ లో మంచు విష్ణు హీరోగా వ‌చ్చిన విష్ణు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో 2005లో వ‌చ్చిన‌ ‘గరం మసాలా’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ నేప‌థ్యంలో నీతూ చంద్ర వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News