బాలీవుడ్ ఎంట్రీ కోసం బన్నీ ప్లాన్స్..!
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హిందీ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. నార్త్ లో వచ్చే క్రేజ్ ని క్యాష్ చేసుకుని పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ లో సత్తా చాటాడు. ఇప్పుడు 'ఆది పురుష్' అనే స్ట్రెయిట్ హిందీ సినిమా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా హిందీ మార్కెట్ పై కన్నేశారు. ఈ సినిమా అక్కడ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయనున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
'అల వైకుంఠంపురములో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బన్నీ.. ప్రస్తుతం నటిస్తున్న 'పుష్ప' మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. దీని కోసం భారీ ప్లాన్స్ చేసిన బన్నీ టీమ్.. 'పుష్ప' చిత్రాన్ని 'బాహుబలి' 'కేజీఎఫ్ 2' తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కోసం డైరెక్టర్ సుకుమార్ - మైత్రీ ప్రొడ్యూసర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలువురు హిందీ నటీనటులను టెక్నిషియన్స్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీతో ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఒక పెద్ద ప్రమోషన్ ఏజెన్సీతో హీరో టీమ్ చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఫ్యూచర్ లో స్ట్రెయిట్ హిందీ మూవీ చేసే ఆలోచనలో ఉన్న బన్నీ.. ఇప్పటి నుంచే దానికి తగ్గట్లే ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 'పుష్ప' తర్వాత అల్లు హీరో చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. 'పుష్ప 1' విడుదలైన తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు. అలానే 'పుష్ప 2' పూర్తైన తర్వాత ఏఆర్ మురుగదాస్ - బోయపాటి శ్రీను - కొరటాల శివ - ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో బన్నీ సినిమాలు చేయనున్నాడు.