• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలందు ఈ ఇద్దరు హీరోలు...

హీరోలందు ఈ ఇద్దరు హీరోలు వేరయ్యా..!

By - Tupaki Desk
Update: 2021-12-30 07:30 GMT
టాలీవుడ్ లో ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తేనే చాలా గొప్ప విషయంగా అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటిది ఇద్దరు స్టార్‌ హీరోలు అయిన ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లు కలిసి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న నేపథ్యంలో సినీ అభిమానులు.. ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎగ్జైట్‌ తో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇలాంటి ఒక కాంబో రావడానికి ఎన్నేళ్లు వెయిట్ చేయాలో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. కాని ఇలాంటి అరుదైన కాంబోలో.. కలయికలు.. మల్టీ స్టారర్‌ లు మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయ్యాయి. ముఖ్యంగా సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌ మరియు మరో స్టార్‌ హీరో పృథ్వీ రాజ్. వీరిద్దరి కలయికలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి.

మలయాళ సినీ ఇండస్ట్రీ లో వీరిద్దరి స్థాయి ఏంటీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కూడా మల్టీ ట్యాలెంట్‌ ఉన్న స్టార్స్. మోహన్‌ లాల్‌ అంటే పృథ్వీ రాజ్ కు అభిమానం.. ఆ అభిమానంను ఆయన ప్రతి సందర్బంలో చూపిస్తూనే ఉంటాడు. మోహన్ లాల్‌ ను ఒక దేవుడిగా పృథ్వీ రాజ్‌ చూస్తాడని మలయాళ మీడియా వర్గాల వారు అంటూ ఉంటారు. తాను మోహన్ లాల్‌ ను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే లూసీఫర్ లో చూపించి తన అభిమాన హీరోకు సూపర్‌ హిట్‌ ను పృథ్వీ రాజ్ అందించిన విషయం తెల్సిందే. పృథ్వీ రాజ్ అంటే కూడా మోహన్ లాల్‌ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన తో నటించేందుకు.. ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు ఎప్పుడు కూడా సిద్దం అన్నట్లుగా రెండు మూడు సార్లు మోహన్ లాల్ అన్నాడు అంటే ఇద్దరి మద్య బాండింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన లూసీఫర్‌ తర్వాత మరో సినిమా గా బ్రో డాడీ అనే సినిమా రూపొందింది. లూసీఫర్ కు డైరెక్షన్‌ చేస్తూ చిన్న పాత్రలో పృథ్వీ రాజ్ కనిపించాడు. కాని బ్రో డాడీ సినిమా లో పృథ్వీ రాజ్ ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. మోహన్‌ లాల్‌ మరియు పృథ్వీ రాజ్ ల కాంబోలో రూపొందిన ఈ సినిమా వచ్చే నెలలో డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. పృథ్వీ రాజ్ ఈ సినిమా ను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఇక పృథ్వీ రాజ్ హీరోగా మోహన్‌ లాల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. మోహన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న బారోజ్‌ సినిమా లో పృథ్వీ రాజ్ నటిస్తున్నట్లుగా అధికారికంగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకరి దర్శకత్వంలో ఒకరు నటిస్తూ చాలా స్పెషల్‌ అనిపించుకుంటున్నారు. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు కాని.. ఈ ఇద్దరు మాత్రం చాలా స్పెషల్‌ అన్నట్లుగా నిలుస్తున్నారు.


Tags:    
  • BRO Daddy 
  • OTT 
  • BRO Daddy movie songs 
  • Mohanlal 
  • Prithviraj Sukumaran 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS