• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవుడి గురించి...

దేవుడి గురించి చెప్తానంటున్న హాస్యబ్రహ్మ

By - Tupaki Desk
Update: 2021-12-19 05:12 GMT
తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో ప్రథమంగా ఉండే పేరు బ్రహ్మానందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్రహ్మానందం కామెడీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అభిమానులను మరియు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. బ్రహ్మానందం గత కొంత కాలంగా సినిమాల్లో యాక్టివ్ గా లేరు. ఆయనలోని కమెడియన్ ను ఈ తరం దర్శకులు ఆవిష్కరించడంలో విపలం అవుతున్నారు. అయినా కూడా ఆయన పాత కామెడీ వీడియోలు.. మీమ్స్ రూపంలో ఇప్పటికి నవ్విస్తూనే ఉన్నారు. బ్రహ్మానందం ప్రస్తుతం పూర్తి విశ్రాంతి మూడ్ లో ఏమీ లేరు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించడంతో పాటు టీవీ షో లు.. టాక్ షోల్లో కనిపిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున బ్రహ్మానందం అభిమానులు మళ్లీ ఆయన సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు. కాని ఆయన మళ్లీ మునుపటిలా సినిమాలు చేయకపోవచ్చు అంటున్నారు.

ఇక బ్రహ్మానందం ప్రస్తుతం తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి బుక్ రాస్తున్నారట. సాదారణంగా ఇలాంటి పుస్తకాలను ఆటో బయోగ్రఫీ అంటారు. కాని ఇది ఆటో బయోగ్రఫీ కాదట. దేవుడిపై జనాల్లో నమ్మకం కలిగించేందుకు తాను చేస్తున్న చిన్న ప్రయత్నంగా బ్రహ్మానందం చెబుతున్నారు. తాను కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు.. ఆ పరిస్థితుల నుండి తాను బయట పడ్డ విధానంను అందుకు దేవుడు ఎలా సహాయ పడ్డాడు అనే విషయాలను చూపించబోతున్నట్లుగా బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో వారి వెంట ఉండి నడిపించే వాడే దేవుడు. ఆ విషయాలనే బుక్‌ రూపంలో ఇవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

మై ఎక్స్ పీరియన్స్ విత్‌ గాడ్ అనే పేరుతో పుస్తకంను రాస్తున్నట్లుగా బ్రహ్మానందం పేర్కొన్నారు.  ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన నేను ఢిల్లీ లోని రాష్ట్రపతి ముందు నిల్చున్నాను అంటే నేను చాలా కష్టపడ్డాను అని.. నేను సెల్ఫ్‌ మేడ్ అని అనుకుంటారు. కాని నా ఈ జీవితంలో.. జర్నీలో ఖచ్చితంగా దేవుడు కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఆయన నా జీవితంలో ఉండి నడిపించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేది ఈ పుస్తకంలో వివరించబోతున్నాను. నేను రాస్తున్న ఈ పుస్తకంతో ఒక్కరు అయినా దేవుడిపై నమ్మకం పెంచుకుంటే సంతోషం అన్నట్లుగా బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నమ్మి జీవితంలో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యలు.. ఉన్నత శిఖరాలు చేరుకుంటారని బ్రహ్మానందం అన్నారు.
Tags:    
  • Brahmanandam 
  • Brahmanandam comments 
  • Brahmanandam movies 
  • Brahmanandam comedy 
  • Brahmanandam biography 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS