ఇంకో కొత్త ఛాలెంజ్ షురూ అయ్యింది
సోషల్ మీడియాలో గత కొంత కాలంగా ఏదో ఒక ఛాలెంజ్ నడుస్తూ వస్తోంది. ఐస్ బకెట్ ఛాలెంజ్ తో వీటి గురించి సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ అయ్యింది. ఒకరు ఏదైనా పని చేసి దాన్ని చేయాల్సిందిగా కొంత మందికి సోషల్ మీడియా ద్వారా ఛాలెంజ్ చేయాలి. అలా ఇప్పటి వరకు ఐస్ బకెట్ ఛాలెంజ్.. ఫిట్ నెస్ ఛాలెంజ్.. చెట్లు నాటే ఛాలెంజ్.. కీకీ చాలెంజ్.. బొద్దింకలను మొహంపై వేసుకునే ఛాలెంజ్.. ఇలా ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది.
'బాటిల్ క్యాప్' ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది. హాలీవుడ్ స్టార్ జసోన్ స్టాతమ్ ఇచ్చిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ను గాయకుడు జాన్ మయార్ స్వీకరించడంతో ఈ ఛాలెంజ్ కు ప్రాచుర్యం పెరిగింది. హాలీవుడ్ నుండి మెల్ల మెల్లగా బాలీవుడ్ తో పాటు సౌత్ కు కూడా వచ్చేసింది.
స్టార్స్ మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఈ చాలెంజ్ ను తెగ స్వీకరిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా.. ఒక బాటిల్ క్యాప్ ను సగం తీసి ఉంచుతారు. మిగిలిన సగంను కాలితో తన్ని తీయాల్సి ఉంటుంది. కాలితో తన్నిన సమయంలో బాటిల్ ఏమాత్రం కదలకుండా జాగ్రత్త పడాలి. బాటిల్ కదలకుండా మూత తీస్తే ఛాలెంజ్ ఫినిష్ అయినట్లు. తాము స్వీకరించి చేసిన ఛాలెంజ్ ను మరికొందరికి చేయాలి. ఇలా ప్రస్తుతం ఈ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరియు ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈ చాలెంజ్ ను స్వీకరించడం జరిగింది.