టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్.. ఇక పాన్ వ‌ర‌ల్డే!

Update: 2021-08-27 01:30 GMT
తెలుగు సినిమా స్థాయి అమాంతం మారింది. మ‌న స్టార్ హీరోల న‌డుమ పోటీ అంత‌కంత‌కు తీవ్ర‌త‌రం అవుతోంది. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ పాన్ ఇండియా చిత్రాల‌పైనే దృష్టిపెడుతున్నారు. క‌థ‌లు కంటెంట్ ప‌రంగా ఎంపిక‌లు అమాంతం మారిపోయాయి. అన్ని భాష‌ల్లోనూ యూనివ‌ర్శ‌ల్ గా వ‌ర్క‌వుట‌య్యే స్క్రిప్టులే కావాలి ఇప్పుడు. బ‌హుభాష‌ల్లో రిలీజుల్ని దృష్టిలో ఉంచుకుని ఇత‌ర భాష‌ల న‌టుల్ని సైతం రంగంలోకి దించి సినిమా రేంజ్ ని అంత‌కంత‌కు పెంచేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్న చిత్రాలు ప‌రిశీలిస్తే టాలీవుడ్ సినిమా ఎంతగా ఎదిగిందో అర్ధ‌మ‌వుతుంది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న `ఆర్ ఆర్ ఆర్` లో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో అజ‌య్ పాత్ర హైలైట్ గా నిల‌వ‌నుంది. ఆయ‌న‌పై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు జ‌క్క‌న్న‌ చిత్రీక‌రించారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న‌`ఆది పురుష్ `చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావ‌ణ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు- హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ ర‌కంగా సైఫ్ అలీఖాన్ తెలుగు ఎంట్రీ ఖ‌రారైంది. ఇక నాగ్ అశ్విన్- ప్ర‌భాస్ కాంబినేష‌న్ లో  తెర‌కెక్క‌నున్న భారీ బ‌డ్జెట్ చిత్రంలో బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. అమితాబ్ ఇంత‌కుముందు చిరంజీవి సైరా-న‌ర‌సింహారెడ్డిలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా`లో న‌ర‌సింహారెడ్డికి గురువు పాత్ర‌లో న‌టించారు. అలాగే మెగాస్టార్ ప్ర‌స్తుత చిత్రం `గాడ్ ఫాద‌ర్` లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మెగాస్టార్ తో ఉన్న స్నేహం అభిమానం నేప‌థ్యంలో స‌ల్మాన్ వెంట‌నే ఈ సినిమాకి అంగీక‌రించారు.  ప్ర‌స్తుతం స‌ల్మాన్ భాయ్ టైగ‌ర్ -3 ర‌ష్యా షూట్ లో బిజీగా ఉన్నారు.  అక్క‌డ నుంచి రాగానే నేరుగా గాడ్ ఫాద‌ర్ టీమ్ తో  జాయిన్ కానున్నారు. ఇప్పుడీ వార్తా జాతీయ మీడియాలోనూ  ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంకా అవ‌స‌రం మేర మ‌ల‌యాళం.. త‌మిళ్ బిగ్ స్టార్స్ ని  కూడా టాలీవుడ్ మేక‌ర్స్ బ‌రిలో దించేస్తూ పాన్ ఇండియా అప్పీల్ ని పెంచేస్తున్నారు. కేజీఎఫ్ 2లో సంజ‌య్ ద‌త్ అధీరా అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్- అమితాబ్- దీపిక ల‌తో నాగ్ అశ్విన్ ఏకంగా సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో తెర‌కెక్కిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌కుముందు 2.0లో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టించారు. ఇప్పుడు ఆర్.సి 15లో ఓ బాలీవుడ్ హీరో విల‌న్ గా క‌నిపిస్తార‌న్న ప్ర‌చారం ఉంది. ప్ర‌భాస్ సాహోలో బాలీవుడ్ స్టార్స్ న‌టించారు. స‌లార్ లోనూ ఇరుగు పొరుగు భాష‌ల స్టార్లు న‌టిస్తున్నారు.

పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి ఎదిగేస్తున్నాం..

తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌-మ‌ల‌యాళం- హిందీ ని క‌లుపుకుని బ‌హుభాష‌ల్లో తెర‌కెక్కే సినిమాల‌న్నీ పాన్ ఇండియా కేట‌గిరీలో ఉన్నాయి. వీటికి అమెరికా- చైనా-జ‌పాన్ లాంటి చోట్లా ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. న్యూజిలాండ్- ఆస్ట్రేలియాలోనూ తెలుగు ప్ర‌జ‌లు ఉన్న డ‌యాస్పోరాలో రిలీజ్ చేస్తూ పాన్ వ‌ర‌ల్డ్ రేంజుకు చేరుస్తున్నారు. మునుముందు రానున్న టాలీవుడ్ సినిమాల‌న్నీ పాన్ వ‌ర‌ల్డ్ రేంజులోనే రిలీజ్ కానున్నాయి. ఇక‌పై హాలీవుడ్ కి ధీటుగా తెలుగు సినిమాలు అసాధార‌ణ వ‌సూళ్ల‌ను తేనున్నాయ‌ని అంచ‌నా. కంటెంట్ తో పాటు క్వాలిటీ విష‌యంలోనూ టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ కి తీసిపోవ‌డం లేదు. ప్ర‌స్తుత‌ పాన్ ఇండియా పోటీలో హిందీ సినిమాల‌కు ధీటుగా తెలుగు సినిమాలు ఆద‌ర‌ణ ద‌క్కించుకుని పోటీప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.
Tags:    

Similar News