• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ది అర్చీస్' ఫస్ట్ లుక్:...

'ది అర్చీస్' ఫస్ట్ లుక్: ఒకే షోతో కపూర్ - ఖాన్ - బచ్చన్ ఫ్యామిలీ నటవారసుల ఎంట్రీ..!

By - Tupaki Desk
Update: 2022-05-14 11:21 GMT
సినీ ఇండస్ట్రీలో వారసులకు కొదవుండదు. నెపోటిజం అని ఎంత ట్రోల్ చేయినా ఈ విషయంలో మాత్రం ఏ సినీ ఫ్యామిలీ కూడా వెనక్కి తగ్గదు. బాలీవుడ్ విషయానికొస్తే.. కపూర్ - బచ్చన్ - ఖాన్.. ఇలా అన్ని ఫ్యామిలీల నుంచి నటవారసులు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూడు పెద్ద సినీ కుటుంబాల నుంచి ముగ్గురు స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగుపెటున్నారు.

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా - బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ - నిర్మాత బోనీ కపూర్ వారసురాలు ఖుషీ కపూర్ ''ది అర్చీస్'' అనే వెబ్ సిరీస్ తో తెరంగేట్రం చేస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జోయా అక్తర్ ఓ షోను రూపొందిస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

'ది ఆర్చీస్' అనే అమెరికన్ కామిక్ సిరీస్ ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇది 1960స్ బ్యాక్ డ్రాప్ లో లైవ్ యాక్షన్ మ్యూజికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుంది. గ్రాఫిక్ ఇండియా సంస్థతో కలిసి టైగర్ బేబీ ప్రొడక్షన్స్ ఈ షోని నిర్మిస్తోంది. ఏప్రిల్ 18న ఈ సిరీస్ షూటింగ్ ను ప్రారంభించారు.

తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా 'ది ఆర్చీస్' ఫస్ట్ లుక్ తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది. ''మీ పిక్నిక్ బాస్కెట్ లను రెడీగా ఉంచుకోండి.. మీ అందమైన దుస్తులను ఎంచుకోండి. మనం ఆర్చీస్ గ్యాంగ్ ని అభినందించబోతున్నాము!. జోయా అక్తర్ సినిమా ఈ పాత్రలను మీ ముందుకు తీసుకువస్తోంది'' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

'ది ఆర్చీస్' సినిమాలో సుహానా ఖాన్ - ఖుషి కపూర్ - అగస్త్య నందాతో పాటు మిహిర్ అహుజా - డాట్ - వేదంగ్ రైనా - యువరాజ్ మెండా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో వచ్చిన ఈ టీజర్ లో.. అందరూ వింటేజ్ లుక్స్ అండ్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

అగస్త్య నందా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'ది ఆర్చీస్' టీజర్ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ ''మరో సూర్యోదయం (SONrise).. నా మనవడు (GrandSON).. నీకు అందరి ఆశీస్సులు ఉంటాయి అగస్త్య.. లవ్ యూ'' అని బిగ్ బీ పేర్కొన్నారు.

మూడు ఫ్యామిలీల నుంచి ముగ్గురు నటవారసులు ఒకేసారి ఒకే షో ద్వారా బీ టౌన్ కు ఎంట్రీ ఇస్తుండటంతో అందరి దృష్టి 'ది ఆర్చీస్' సిరీస్ పై పడింది. అదే సమయంలో నెపోటీజమ్ అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ఔట్ సైడర్స్ కు అవకాశం ఇవ్వకుండా.. మరో జెనరేషన్ స్టార్ కిడ్స్ ను బలవంతంగా జనాల మీదకు రుద్దుతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Full View
Tags:    
  • Bollywood 
  • starhero 
  • heroines 
  • kids 
  • movieentry 
  • AgastyaNanda 
  • KhushiKapoor 
  • MihirAhuja 
  • SuhanaKhan 
  • VedangRaina 
  • thearchies 
  • movie 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS