చెల్లెలిని స్టార్ ని చేసేందుకు అక్క తహతహ
బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ నేటితరంలో పాపులర్ నాయికగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్లలో ప్రయోగాత్మక చిత్రాలతో ఈ బ్యూటీ నటిగా ఆకట్టుకుంది. `బాల`..`లస్టో స్టోరీస్`.. `ధమ్ లగాకీ హయేషా`.. `శుభ్ మంగళ్ సావధాన్` చిత్రాలతో తన ఇమేజ్ అమాంతం పదింతలైంది. స్టార్ కిడ్స్ రాజ్యమేలుతోన్న బాలీవుడ్ లో ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండానే తనకంటూ ఓ ఐడెంటిటీని దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో కొన్ని విమర్శలు.. అవరోధాలు దాటుకుని నిలదొక్కుకుంది. ఇటీవల ట్రెండ్ లో సోషల్ మీడియాను తెలివిగా సద్వినియోగం చేసుకుని మరింత ఫోకస్ అవుతోంది.
ఇదే సమయంలో తన సోదరిని కూడా భూమి రంగంలోకి దించింది. తనలా కకాకుండా సిస్టర్ సమీక్షా పడ్నేకర్ కి ఓ గైడ్ లా నిలబడి ఎంకరేజ్ చేస్తోంది. ఆ ఇద్దరు ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు హాటెస్ట్ ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. సమీక్షా ఇంకా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనప్పటికీ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. అక్క సహకారం.. సోషల్ మీడియా ఫ్యాన్స్ సపోర్ట్ తో అక్కా చెల్లెళ్లిద్దరు ఇప్పుడు ఇన్ స్టాని ఏల్తున్నారు. తాజాగా సిస్టర్స్ ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసారు. ఇందులో భూమి - సమీక్షా పెడ్నేకర్ లు ఒకే రంగు దుస్తుల్లో తళుక్కున మెరుస్తున్నారు. సమీక్ష వెల్వెట్ బ్లాక్ మినీ నెక్ లైన్ డ్రెస్ ధరించింది. కళ్లకి బ్లాక్ బ్రాడెండ్ కళ్లద్దాలు ధరించి..పెదాలకు గులాబీ వర్ణం లిప్ స్టిక్ అద్దింది.
ఇక భూమి పెడ్నేకర్ క్రాస్ హాల్టర్ నెక్ లైన్ ధరించింది. ఇందులో భూమి థై సొగసులు హైలైట్. అక్కాచెల్లెలిద్దరు కలిసి దిగిన ఫోటో చూపరులను ఆకట్టుకుంటోంది. గతంలోనూ భూమి కొన్ని టెంప్టింగ్ ఫోటోషూట్లకు సిస్టర్స్ ఫోజులిచ్చారు. ప్రస్తుతం భూమి ఫెడ్నేకర్ సమీక్ష ఎంట్రీ పై సీరియస్ ప్రయత్నాల్లోనూ ఉన్నట్లు సమాచారం. ఎలాగైన చెల్లెల్ని కూడా బాలీవుడ్ లో లాంచ్ చేసి కెరీర్ లో స్థిరపడేలా చేయాలన్న ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
భాగమతి రీమేక్ లో నటించిన బ్యూటీ
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ భాగమతి హిందీలో దుర్గావతి పేరుతో రీమేకైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ హిందీలోనూ దర్శకత్వం వహించారు. అనుష్క నటించిన పాత్రలో భూమి పెడ్నేకర్ నటించగా తన నటనకు గుర్తింపు దక్కింది. అక్షయ్ కుమార్ ఇందులో కథానాయకుడిగా నటించారు. రిలీజ్ ముందు ఈ సినిమా టైటిల్ రకరకాల వివాదాల వల్ల `దుర్గామతి ది మిత్` అని మార్చారు. 2020 డిసెంబర్ 11 న ప్రైమ్ లో విడుదలైంది. భూమి పెడ్నేకర్ ఇంతకు ముందు అక్షయ్ కుమార్ తో కలిసి 2017 హిట్ చిత్రం `టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ`లో నటించారు.
తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నాలు
ఇటీవల భూమి పెడ్నేకర్ పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే సౌత్ లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ ప్రతిభావని తహతహలాడుతోందట. సరైన స్క్రిప్ట్ దర్శకుడు కుదిరితే తెలుగు సినీ పరిశ్రమలోనూ ప్రవేశించేందుకు తనకు అభ్యంతరం లేదని ఇంతకుముందు భాగమతి రీమేక్ దుర్గామతి ప్రమోషన్స్ లో వెల్లడించింది. అయితే తనను మెప్పించే స్క్రిప్ట్ ని ఇక్కడ ఏ దర్శకుడు సిద్ధం చేస్తారో చూడాలి.