2018 లో టాలీవుడ్ షైనింగ్
2018లో టాలీవుడ్ షైన్ అయ్యిందనే చెప్పాలి. అసలు సక్సెస్ అనేదే లేదు.. 5 శాతానికి ఎప్పుడూ మించదు అనుకుంటే - ఈ ఏడాది తక్కువ సినిమాలు రిలీజై - అందులో కొన్ని బ్లాక్ బస్టర్లతో పరిశ్రమ కళకళలాడిందనే చెప్పాలి. ఈ ఏడాది బెస్ట్ హిట్స్ ని పరిశీలిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించారు. అతడు నటించిన రంగస్థలం 200కోట్ల క్లబ్ లో చేరింది. దాదాపు 100కోట్ల బాక్సాఫీస్ షేర్ తో నాన్ బాహుబలి రికార్డుల్ని తిరగరాసింది. ఆ తర్వాత మహేష్ నటించిన `భరత్ అనే నేను` చిత్రం ఇంచుమించు అదే తరహాలో బంపర్ హిట్ కొట్టింది. ఆ రెండు సినిమాలు ఊరటనిచ్చాయి అనగానే `మహానటి` రూపంలో మరో సంచలన విజయం టాలీవుడ్ కి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. బయోపిక్ ల ట్రెండ్‌లో సావిత్రి జీవితకథతో కీర్తి సురేష్ అసమాన నట ప్రతిభతో మహానటి గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అశ్వనిదత్ కాంపౌండ్ కి వెలుగులు వచ్చాయి. అలాగే యంగ్ యమ ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత` రెగ్యులర్ ఫ్యాక్షన్ యాక్షన్ తో వచ్చినా త్రివిక్రమ్ ఆర్క్ ట్రీట్ మెంట్ వర్కవుటైంది. ఫలితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అదుకుంది.
అలాగే నవతరం హీరోల్లో విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ హిట్స్ ని అందుకున్నాడు. `గీత గోవిందం` చిన్న సినిమాగా రిలీజై పెద్ద సినిమాల్ని మించిన విజయం దక్కించుకుంది. ఏకంగా 100కోట్ల షేర్ తో గీతా ఆర్ట్స్ 2- యువి క్రియేషన్స్ సంస్థలకు గౌరవమర్యాదల్ని పెంచింది. అలాగే `ట్యాక్సీవాలా` ముందే వెబ్ లో లీకైనా - బంపర్ హిట్ కొట్టడంతో దేవరకొండ హవాకి అంతూ దరీ అన్నదే లేకుండా పోయింది. నాగశౌర్య నటించిన ఛలో - అమ్మమ్మ గారిల్లు రెండు చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు విజయం సాధించాయి. `ఛలో` శౌర్య కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఆర్ ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ విజయంతో కార్తికేయ లాంటి ఎనర్జిటిక్ హీరో తెరకు పరిచయం అయ్యారు. `తొలి ప్రేమ` రూపంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పెద్ద టర్న్ అయ్యిందనే చెప్పాలి. ఫిదా తర్వాత అతడికి మరో విజయం పెద్ద బూస్ట్. అలాగే అడివి శేష్ ఊహించని రీతిలో `గూఢచారి`గా వచ్చి బాక్సాఫీస్ కి దిమ్మతిరిగే ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమాతోనే అక్కినేని మనవరాలు సుప్రియ మరోమారు నటిగా వెలుగులోకి వచ్చారు. సమంత నటించి - నిర్మించిన `యూటర్న్` యావరేజ్ రిజల్ట్ అందుకుంది.
2018లో రెండు బిగ్ డిజాస్టర్స్ అంతే హాట్ టాపిక్ అయ్యాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` పరాజయం డిస్ట్రిబ్యూటర్లకు మింగుడుపడలేదు. దాంతో నిర్మాతలు నష్టాల్లో కొంత భరించాల్సి వచ్చిందని టాక్ వినిపించింది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్న `నా పేరు సూర్య` డిజాస్టర్ అవ్వడం అతి పెద్ద కుదుపు అనే చెప్పాలి. ఆ తర్వాత వేరొక కథను ఎంపిక చేసుకునేందుకు బన్ని ఏడాది గ్యాప్ తీసుకోవడం చర్చకొచ్చింది. రవితేజ `అమర్ అక్బర్ ఆంటోని` - దేవరకొండ `నోటా` - నాగచైతన్య `సవ్యసాచి` - బెల్లంకొండ `కవచం` - సందీప్ కిషన్ `నెక్ట్స్ ఏంటి?` ఫ్లాపులుగా నిలిచి నిరాశపరిచాయి. ఏడాది చివరిలో రిలీజైన శర్వానంద్ `పడి పడి లేచే మనసు` - వరుణ్ తేజ్ `అంతరిక్షం` చిత్రాలు సోసోనే అన్న టాక్ తో డీలా పడ్డాయి. ఇక ఎండింగ్ లో డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్ కి ముందు నిఖిల్ `ముద్ర` రూపంలో గుడ్ న్యూస్ చెబుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది మునుపటితో పోలిస్తే బ్లాక్ బస్టర్లతో ఓపెన్ అవ్వడంతో అందుకు తగ్గట్టే పాజిటివ్ షైన్ కనిపించింది. సక్సెస్ శాతం 5కు మించిందని విశ్లేషిస్తున్నారు. 2019 కొంగొత్త ఆశలతో వరుస విజయాలతో మొదలవ్వాలని ఆకాంక్షిద్దాం.