మహానటిలో నన్ను వదిలేయండి ప్లీజ్

Update: 2018-05-17 05:34 GMT
మహానటి విడుదల అయ్యాక సావిత్రి గారితో పాటు జెమిని గణేషన్ జీవితం గురించి కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది. అసలు ఆయన ఎవరు ఏ సినిమాలలో నటించారు అనే దాని కన్నా ఆయన పర్సనల్ లైఫ్ గురించిన రీసెర్చ్ ఎక్కువగా జరుగుతోంది. నిజానికి లెంగ్త్ సమస్య వల్ల కొన్ని పాత్రలను సన్నివేశాలను ఎడిటింగ్ టేబుల్ లోనే తీసేయాల్సి రావడం అన్ని సినిమాలకు జరిగేదే. కాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎవరైతే ఈ కోతలకు బలి అవుతారో వాళ్ళకు కొద్దిగా మనస్తాపం కలగడం సహజం. జెమిని గణేషన్ కు సినిమాలో ఇద్దరు భార్యలు మాత్రమే ఉన్నట్టు చూపిస్తారు. అందులో అలిమేలు ఒకరైతే మరొకరు సావిత్రి. కాని ఆయనకు మరో భార్య కూడా ఉందన్న సంగతి చాలా మందికి తెలుసు. ఆవిడే పుష్పవల్లి. బాలీవుడ్ నిన్నటి తరం హీరొయిన్ రేఖా తల్లి. జెమినీ గణేషన్ ఈమెకు తండ్రి.

మహానటిలో ఈ ఇద్దరికీ సంబంధించి రెండు మూడు సన్నివేశాలు ఉన్నాయట. కాని అప్పటికే లెంగ్త్ మూడు గంటలకు పైగా రావడంతో వేరే ఆప్షన్ లేక నాగ అశ్విన్ వాటిని తీసేయించాడు. దాని గురించి ఆ పాత్ర పోషించిన బిందు చంద్రమౌళి తన అసంతృప్తిని సోషల్ మీడియాలో వ్యక్తం చేయటంతో అది కాస్త వైరల్ అయ్యింది. రకరకాల కథనాలు ఈ ఇష్యూ గురించి ప్రచారం కావడంతో బిందు చంద్రమౌళి మళ్ళి స్పందించాల్సి వచ్చింది. ఒక క్లాసిక్ మూవీలో తాను చేసిన చిన్న పాత్ర తెరమీద కనిపించలేదు అన్న తన ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేసానే తప్ప ఇలా తనకు చెప్పకుండా అందరు ఏవేవో చెప్పుకోవడం గురించి అభ్యంతరం వ్యక్తం చేసింది. మహానటి టీం ఎఫర్ట్ చాలా గొప్పదని, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, అంతే తప్ప ఇలా ఏదో ఒక వివాదం చేయటం తగదని దీనికి శుభం కార్డు ఇచ్చేసింది. పుష్పవల్లి పాత్ర ఉన్న సీన్లు ఒకటో రెండో మాత్రమేనట. వాటి తాలూకు ఇమేజ్ ఆన్ లైన్ లో వైరల్ కావడమే ఇంత ప్రచారం లభించడానికి కారణం.
Tags:    

Similar News