బిగ్ బాస్ సీజన్ 6లో.. ఈ సెన్సేషనల్ జంటను దించుతున్నారట

Update: 2022-08-28 04:24 GMT
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా.. ఏ భాషలో అయినా సరే.. విజయమే తప్పించి పరాజయం అన్నది లేకుండా సాగిపోయే సక్సెస్ ఫుల్ రియాల్టీ షో 'బిగ్ బాస్'. ఇప్పటివరకు ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసి.. మరికొద్ది రోజుల్లో ఆరో సీజన్ ను రంగంలోకి దించుతున్న వైనం తెలిసిందే. సెప్టెంబరు 4 నుంచి సీజన్ 6 షురూ అవుతున్నట్లుగా స్టార్ మా అధికారిక ప్రకటనలోనూ వెల్లడించింది.

ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టుల పేర్లు ఏమై ఉంటాయన్న ఆసక్తికి తగ్గట్లే.. ఈ మధ్యనే హౌస్ లో ఉండే పోటీదారుల జాబితా లీకుల రూపంలో బయటకు వచ్చింది. దీనిపై అటు చానల్ కానీ.. ఇటు బిగ్ బాస్ ప్రొడక్షన్ కానీ స్పందించటం లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపించటమే కాదు.. విడిపోతున్నట్లుగా ప్రచారం సాగిన సింగర్స్ జోడీ హేమచంద్ర - శ్రావణ భార్గవిల జంట బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం ఖాయమంటున్నారు.

గతంలో ఎలా అయితే టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ - వితిక దంపతులు హౌస్ లో సందడి చేశారో.. ఈసారి హేమచంద్ర - శ్రావణ భార్గవిల పెయిర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది. వీరిద్దరూ హౌస్ లో ఉండటం కోసం భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని చెబుతున్నారు. ఈ కారణంతోనే మరో మాటకు అవకాశం ఇవ్వ కుండా ఈ హాట్ సింగర్స్ జంట బిగ్ బాస్ షోకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ జరిగిందని.. విడిపోయే వరకు వచ్చారంటూ బోలెన్ని మాటలు వినిపించాయి. అలాంటి వాటికి పూర్తిస్థాయిలో సమాధానంలో చెప్పేందుకు వీలుగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ జంట బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వస్తే ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే అంటున్నారు నెటిజన్లు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేస్తూ షోని సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ చేస్తున్న కింగ నాగార్జున నాలుగోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు. సీజన్ 6 లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్ల వివరాలకు మరికొద్ది రోజులు ప్రకటించనున్నారు. మొత్తానికి మరో వంద రోజుల పాటు రియాల్టీ షోతో అభిమానుల్ని అలరించేందుకు బిగ్ బాస్ సిద్ధమవుతున్నారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News