ఫిబ్రవరిలో స్టార్ట్‌ కానున్న బిగ్ బాస్‌ 'స్టార్‌ మా' లో కాదు!

Update: 2021-12-20 16:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 పూర్తి అయ్యింది. చాలా మంది ఊహించినట్లుగా.. ఆశించినట్లుగా విన్నర్ గా సన్నీ నిలిచాడు. బిగ్‌ బాస్ సీజన్ సీజన్ కు కనీసం ఆరు ఏడు నెలల గ్యాప్ ఉంటుంది. కాని ఈ సారి బిగ్ బాస్ ను వెంటనే షురూ చేయబోతున్నట్లుగా నాగార్జున సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్‌ లో ప్రకటించాడు.  రెండు నెలల్లోనే బిగ్‌ బాస్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించడంతో అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు నెలల్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్ రెగ్యులర్ బిగ్‌ బాస్ కాదని సమాచారం అందుతోంది. రెగ్యులర్ బిగ్‌ బాస్ స్టార్ మా లో టెలికాస్ట్‌ అవుతుంది. కాని ఫిబ్రవరి నుండి ప్రారంభం కాబోతున్న బిగ్  బాస్‌ మాత్రం ఓటీటీ లో టెలికాస్ట్‌ కాబోతుంది అనేది బుల్లి తెర విశ్లేషకుల అభిప్రాయం. సోషల్‌ మీడియాలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్‌ సీజన్‌ 6 వచ్చే ఫిబ్రవరి నుండి జరుగబోతుంది అంటూ నాగార్జున ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త సీజన్ అన్నాడు. కనుక ఓటీటీ బిగ్‌ బాస్ అంటూ అంతా నమ్మకంగా ఊహించేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ నెలలో తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ గురించి ప్రథానంగా సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. ఓటీటీ బిగ్‌ బాస్ కు నాగార్జున హోస్టింగ్‌ చేయడు. ఫిబ్రవరిలో సీజన్ ప్రారంభం అయితే మే వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెగ్యులర్ బిగ్‌ బాస్ సీజన్ 6 ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే హిందీ లో ఓటీటీ బిగ్ బాస్ వచ్చేసింది. కరణ్ జోహార్‌ ఓటీటీ బిగ్ బాస్ ను హోస్ట్‌ చేస్తుంటే.. సల్మాన్ ఖాన్ రెగ్యులర్‌ బిగ్‌ బాస్ ను హోస్ట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో బిగ్‌ బాస్ కు వస్తున్న ఆధరణ మరియు ఓటీటీ లకు పెరుగుతున్న ఆధరణ నేపథ్యంలో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఓటీటీ బిగ్ బాస్ ను మొదలు పెట్టి తీరాలనే ఉద్దేశ్యంలో నిర్వాహకులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా నాగార్జున ప్రకటించడంతో ఓటీటీ బిగ్ బాస్ ను మరి కొన్ని రోజుల్లో చూడబోతున్నాం అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటీటీ బిగ్ బాస్ కు హోస్ట్‌ గా ఎవరు వ్యవహరిస్తారు అనేది చూడాలి. నాగార్జున రెండు సీజన్ లకు హోస్ట్‌ అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్‌ అవుతారు. కనుక కాస్త తక్కువ క్రేజ్ యంగ్‌ హీరోను లేదా మరెవరైనా ఫిల్మ్ సెలబ్రెటీని అయినా బిబి ఓటీటీ హోస్ట్‌ గా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది జవవరిలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News