• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హరి హర వీరమల్లు'...

'హరి హర వీరమల్లు' రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..?!

By - Tupaki Desk
Update: 2022-03-20 11:30 GMT
`వ‌కీల్ సాబ్‌`, `భీమ్లా నాయ‌క్‌`ల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం `హరి హర వీరమల్లు` అనే సినిమా చేస్తున్నాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు.

పీరియాడికల్ డ్రామాగా వ‌స్తోన్న‌ ఈ సినిమా గ‌త ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లి.. కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే అంత‌లోనే క‌రోనా రావ‌డం, మ‌రోవైపు ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్‌పై ఫోక‌స్ పెట్ట‌డంతో.. హరి హర వీరమల్లు చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. ప్రస్తుతం పరిస్థితుల‌న్నీ క్రిష్‌కు అనుకూలంగా మార‌డంతో.. త్వ‌ర‌లోనూ ఈ మూవీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు.

ప‌వ‌న్ సైతం త్వ‌ర‌త్వ‌ర‌గా మిగిలిన పార్ట్‌ను కంప్లీట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడ‌ట‌. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల‌పై తాజాగా ఓ బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ మూవీని ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణయించార‌ట‌. వాస్త‌వానికి ఏప్రిల్ ఆఖ‌రిలోనే హ‌రి హ‌ర వీల‌మ‌ల్లును ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురావాల‌ని భావించారు.

కానీ, అప్ప‌టికి షూటింగ్‌ను వేగంగా కానిచ్చేసినా.. మిగిలిన ప‌నులు పూర్తికాక‌పోవచ్చు. అందుకే ద‌స‌రాకు విడుద‌ల‌ను షిఫ్ట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

కాగా,  17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ వజ్రాల దొంగ పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. అద్భుత‌మైన విజువ‌ల్స్‌, భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఈ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతున్నాయి.
Tags:    
  • Pawankalyan 
  • Ram Charan 
  • Hari Hara Veeramallu 
  • Bhavadheyudu Bhagath Singh 
  • Zee5 
  • Ott Platform 
  • Bigupdate 
  • Release 
  • Latestnews 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS